‘తలైవి’ లుక్ పై నిత్యా మీనన్ కామెంట్స్

0

ప్రస్తుతం తమిళనాట ఎక్కడ చూసినా కూడా జయలలిత బయోపిక్ గురించిన చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జయలలిత జీవితంపై తమిళంలో రెండు సినిమాలు ఒక వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ మూడింటిలో కూడా ఎక్కువ శాతం మంది విజయ్ దర్శకత్వంలో కంగనా నటిస్తున్న ‘తలైవి’ చిత్రంపై దృష్టి పెట్టారు. ఇక మరో సినిమాలో నిత్యామీనన్ అమ్మగా నటిస్తుంది. ఆ సినిమాకు ‘ది ఐరెన్ లేడీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ అమ్మగా నటిస్తోంది.

ఇటీవలే తలైవి సినిమా ఫస్ట్ లుక్ వచ్చింది. ఈ ఫస్ట్ లుక్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మేకప్ సరిగా సూట్ అవ్వక పోవడంతో పాటు కంగనా హావభావాలు కూడా సరిగా లేవంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ది ఐరెన్ లేడీ సినిమాలో జయలలిత పాత్ర పోషిస్తున్న నిత్యా మీనన్ స్పందిస్తూ అమ్మ పాత్రకు తాను మాత్రమే పర్ ఫెక్ట్ సూట్ అవుతాను. ఆ పాత్ర కోసం నాకు నేను చాలా మార్పులు చేసుకుంటున్నాంటూ చెప్పుకొచ్చింది.

జయలలిత గురించి నాకు చిన్నప్పటి నుండి చాలా ఆసక్తి. ఆమె గురించి ఇప్పుడు ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. ఆమె లాగే నేను ఏదైనా మొహంపైనే చెప్పేస్తాను. ఆమెలా ఉండేందుకు వంద శాతం ప్రయత్నిస్తున్నాను. తప్పకుండా ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమాను చేస్తానంటూ చెప్పుకొచ్చింది. నాకు తప్ప ఆ పాత్ర మరెవ్వరికి సెట్ అవ్వదన్నట్లుగా నిత్యామీనన్ కామెంట్స్ చేసింది. ఆమె కామెంట్స్ ఇండైరెక్ట్ గా కంగనాను ఉద్దేశించి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
Please Read Disclaimer