అమ్మ బయోపిక్.. ఆలస్యం అమృతం విషం

0

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి `అమ్మ` జయలలితపై ఒకేసారి రెండు బయోపిక్ లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కంగన కథానాయికగా ఏ.ఎల్.విజయ్- విష్ణు ఇందూరి బృందం ఓ బయోపిక్ కి సన్నాహాలు చేస్తోంది. దాంతో పాటే నిత్యామీనన్ టైటిల్ పాత్రలో `ది ఐరన్ లేడి`ని ప్రకటించారు. ప్రియదర్శిని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమాల కోసం కసరత్తు సీరియస్ గానే సాగుతోంది. కంగన.. నిత్యా తమ పాత్రల్లో పరకాయం చేసేందుకు పరిశోధన చేస్తున్నారు. కంగన ఇటీవలే విదేశాల్లో ట్రయల్ షూట్ లో పాల్గొంది. ఈ రెండు సినిమాలతో పాటుగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో జయలలిత జీవితకథ వెబ్ సిరీస్ గా రానుంది.

అయితే ఇంత ఠఫ్ కాంపిటీషన్ లో ఎవరు ముందు వస్తే వాళ్లకే బాక్సాఫీస్ వద్ద జోరు బావుంటుందని అంచనా వేస్తున్నారు. లేటయ్యే కొద్దీ వెనకగా వచ్చే వాళ్లకు అది మైనస్ గా మారుతుంది. ఇటీవల కంగన టీమ్ కసరత్తు చూస్తుంటే బయోపిక్ పై ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమైంది. మరోవైపు నిత్య నాయికగా బయోపిక్ సంగతేమిటి? అంటే .. ఈ ఏడాది చివరికి కానీ సెట్స్ కి వెళ్లలేని పరిస్థితి. పోటీదారుని కొట్టేలా నిత్యా టీమ్ కూడా గట్టి ప్లాన్ లోనే ఉందట.

తాజా ఇంటర్వ్యూలో నిత్యా మాట్లాడుతూ.. భారీగా ఈ సినిమాని తీయాలనే సంకల్పంతో ఉన్నారు. ఏదో క్యాష్ చేసుకునేందుకు అన్నట్టు కాకుండా ప్రతిష్ఠాత్మకంగా భావించి తీస్తున్నారు. దర్శకురాలు ప్రియదర్శిని విజన్ కి నా వంతు పూర్తి సహకారం ఉంటుంది. తను ఇప్పటికే బోలెడంత రీసెర్చ్ చేశారు.. పాత్రలకు తగ్గట్టు భారీ కాస్టింగ్ ఇందులో నటించనున్నారు అని తెలిపింది. ఈ ఏడాది చివరిలో కానీ వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ `ది ఐరన్ లేడి` సెట్స్ పైకి వెళుతుందట. ఓవైపు వెబ్ సిరీస్ దూసుకొస్తోంది. మరోవైపు కంగన స్పీడ్ చూపిస్తోంది. నిత్యా వెనకబడితే ఎలా? స్పీడప్ చేస్తుందేమో చూడాలి.
Please Read Disclaimer