పాపులారిటీ కోసం ఓ జంట పడుతున్న పాట్లు!!

0

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారికి భయపడి ప్రజలు ఇంట్లో నుండి కాలు బయట పెట్టాలంటే పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా భారత ప్రధాని మోడీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ తో యావత్ భారతావనిని ఏకతాటిపైకి వచ్చింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మోడీ పిలుపు మద్దతుగా నిలిచిన ఇళ్లకే పరిమితమయ్యారు. జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం 5 గంటలకు అత్యవసర సేవలు అందిస్తున్న పలు విభాగాల సిబ్బందికి ప్రజలంతా చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. సెలెబ్రెటీలు ఆ చప్పట్ల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను ఉత్సాహపరిచారు. అయితే ఓ నటి మాత్రం వెరైటీగా కరోనా కారణంగా రొమాన్స్ ని ఆపలేం అంటూ పోస్ట్ చేసిన పిక్ వైరల్ అవుతోంది.

‘నందిని’ డైలీ సీరియల్ ద్వారా పాపులర్ అయిన బుల్లితెర నటి నిత్యారామ్ – ఆస్ర్టేలియాకు చెందిన గౌతమ్ అనే బిజినెస్ మెన్ ను వివాహం చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో నిత్యారామ్ – ఆమె భర్త మాస్కులు ధరించి ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘కరోనా కారణంగా రొమాన్స్ ని ఆపలేం’ అంటూ కొటేషన్ ఇచ్చింది. దీనిపై స్పందించిన నెటిజన్లు ఘాటుగానే వ్యాఖ్యలు చేసారు. పాపులారిటీ కోసం నిత్యారామ్ గౌతమ్ జంట ప్రయత్నిస్తోందని అందుకే ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా అందరు బాధ పడుతుంటే వీళ్ళకి సోషల్ మీడియా రొమాన్స్ అవసరమా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మాస్కులు ధరించి ముద్దు పెట్టుకున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-