సౌత్ అమెరికాలో నిత్యానంద.. బాలికలతో అర్ధరాత్రి వీడియోలు

0

నిత్యానంద.. స్వామిజీ ముసుగులో మహిళలతో రాసలీలలు చేస్తూ వీడియోలకు దొరికిపోయిన ఈ గురూజీ ఇప్పుడెక్కడున్నాడో తెలసింది. ఈయన తమిళ ప్రముఖ హీరోయిన్ తో సాగించిన సరస సల్లాపాల వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. దక్షిణాదిన ఎంతో పాపులర్ అయిన స్వామీజీ పోలీసులకు దొరకకుండా చాకచక్యంగా దేశం దాటేశాడు. అయితే నిత్యానంద చెర నుంచి తాజాగా తప్పించుకున్న ఇద్దరు బాలికలు చెప్పిన విషయాలు చూసి ఇప్పుడు అందరూ షాకయ్యారు. నిత్యానంద ఆకృత్యాలు విని నివ్వెరపోతున్నారు.

తాజాగా గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్ లోని నిత్యానంద ఆశ్రమంపై దాడి చేశారు. కొంతమంది మహిళలు పిల్లలను రక్షించారు. ఇద్దరు నిత్యానంద మహిళా శిష్యులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు బాలికలు నిత్యానంద గురించి చెప్పిన విషయాలు విస్తుగొలుపుతున్నాయి.

యుక్తవయసులోని తమ అక్కను అర్ధరాత్రి నిత్యానంద నిద్రలేపే వారని.. ఫుల్ గా మేకప్ వేసి అర్ధరాత్రిళ్లు వీడియోలు తీసేవారని ఓ బాలిక షాకింగ్ విషయం చెప్పుకొచ్చింది. 2013లో నిత్యానంద ఆశ్రమంలో చేరిన తమకు 2017లో నిత్యానంద అసలు రూపం తెలిసిందని ఆమె వాపోయింది. శారీరకంగా మానసికంగా వేధించారని విరాళాల కోసం తమ వీడియోలు తీశారని ఆవేదన వ్యక్తం చేసింది. నిత్యానందకు 3 లక్షల నుంచి 8 కోట్ల వరకూ విరాళాలు వందల ఎకరాల భూములు విరాళంగా భక్తులు ఇచ్చేవారని బాలికలు తెలిపారు.

నిత్యానందపై ఆరోపణలు వచ్చాక ఆయన దేశం దాటడంలో పోలీసులు సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 40కు పైగా కేసులు నమోదైన నిత్యానందను దేశం వదిలి వెళ్లేలా చేశారని ఆరోపణలు వచ్చాయి. 2018 సెప్టెంబరులోనే నిత్యానంద పాస్ పోర్టు గడువు తీరిపోయింది. అప్పటికి కొద్దిముందే ఆయన దేశం దాటి వెళ్లిపోయాడు. పాస్ పోర్టు రెన్యువల్ కు దరఖాస్తు చేసుకున్నా అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతం ఆయన సౌత్ అమెరికాలోని ఈక్వెడార్ దేశం చేరిపోయాడని తెలిసింది. ఆ దేశంలో ఆశ్రమం ఏర్పాటు చేసి ఉండడానికి తిరుగుతున్నాడని ఆయన అనుచరురాలు తెలిపింది.

2018లో చివరి సారి యూపీలో కుంభమేళాలో హాజరయ్యేందుకు నిత్యానంద వెళ్లగా అతడు పాల్గొనడానికి యూపీ పోలీసులు అనుమతించలేదు. తర్వాత చాకచక్యంగా నిత్యానంద దేశం దాటి ప్రస్తుతం ఈక్వెడార్ దేశంలో సెటిల్ అయినట్లు సమాచారం.
Please Read Disclaimer