సింపుల్ గా మత్తెక్కిస్తోంది..ఇదే కదా నివేదనం!

0

`మెంటల్ మదిలో` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన తమిళ నటి నివేద పెథురాజ్. తొలి సినిమా పెద్ద సక్సెస్ కాకపోయినా వేడెక్కించే అందాల రాశిగా ఐడెంటిఫై అయ్యింది. అటుపై ఛాన్సులకు కొదవైతే లేదు. తెలుగు- తమిళంలో వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే అల వైకుంఠపురములో చిత్రంలో నటించింది. ప్రస్తుతం రామ్ మూవీ రెడ్ లోనూ నటిస్తోంది. అటు తమిళ్ లో మూడు సినిమాలు చేస్తోంది. దాదాపు అన్ని సినిమాలు వచ్చే ఏడాది ఒకేసారి రిలీజ్ కానున్నాయి. ఇక సోషల్ మీడియలో అమ్మడు ఎప్పటికప్పుడు నెటిజనులకు రెగ్యులర్ ట్రీట్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా నివేద తన నేచురల్ అందాన్ని ఎలివేట్ చేసే ఓ ఫోటోని సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. ఎంత సింపుల్ గా కనిపిస్తోందో అంతే హాట్ అప్పీల్ తో మతులు చెడగొడుతోంది. ఆయిలీ అందాలతో షైనింగ్ లుక్ తో నివేద సింపుల్ స్మైల్ ఇట్టే కవ్వించేస్తోంది. ఇక అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ లో నటించాక వెంట వెంటనే సినిమాలకు సంతకాలు చేసేస్తుందని భావిస్తే.. ఇప్పటికి తెలుగులో రెడ్ లో మాత్రమే నటిస్తోంది.

నివేద ప్రస్తుతం నవతరం దర్శకుల కథలు వింటోందట. ఇక అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులొస్తే మాత్రం అస్సలు విడిచిపెట్టేందుకు సిద్ధంగా లేదట. అలాగే లేడీ ఓరియెంటెడ్ కథలు వస్తే కాస్త ఆచితూచి ఎంపికలు చేయాలనుకుంటోందట. గ్లామరస్ రోల్స్ చేస్తూనే తనని తాను ఎలివేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలని నివేద ప్లాన్ చేస్తోందట.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-