‘అల వైకుంఠపురంలో’ ఇలా సెకండ్ బ్యూటీ

0

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నివేథ పేతురాజ్ నటిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఇప్పటి వరకు ఆమెకు సంబంధించిన ఎలాంటి పోస్టర్ రాలేదు. రేపు రాములో రాముల పాట విడుదల నేపథ్యంలో ఆమె లుక్ ను రివీల్ చేశారు. ఈ కొత్త పోస్టర్ లో పూజా హెగ్డేకు ఏమాత్రం తగ్గకుండా నివేథ పేతురాజ్ ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ కు మాత్రమే ప్రాముఖ్యత ఉంటుంది. సెకండ్ హీరోయిన్ చాలా తక్కువ స్కోప్ ఉంటుందనే టాక్ ఉంది. కాని ఈసారి మాత్రం కాస్త భిన్నంగా నివేథ పేతురాజ్ కు ఎక్కువ ప్రాముఖ్యతను దర్శకుడు త్రివిక్రమ్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఈ విషయమై ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాములో రాముల పాటలో నివేథ పేతురాజ్ లుక్స్ పరంగా ఆకట్టుకుంది. ఇక రేపు పాట విడుదలైతే అందులో మరింతగా ఆమెను చూపిస్తారేమో చూడాలి.

ఈ చిత్రంపై నివేథ చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పటి వరకు చిన్న సినిమాలు.. చిన్న హీరోలతో చేసిన నివేథ మొదటి సారి మెగా హీరోతో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోలతో ఈమె నటించే ఛాన్స్ లు దక్కించుకుంటుందనే టాక్ వినిపిస్తుంది. అల వైకుంఠపురంలో ఈమెకు కాస్త ఎక్కువ స్కోప్ ఉండి మంచి నటన ప్రదర్శిస్తే తప్పకుండా ఈమె స్టార్ హీరోలకు వాంటెడ్ హీరోయిన్ అవుతుందని టాక్ వినిపిస్తుంది.
Please Read Disclaimer