నివేదలో అదే వేడి

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో `అల వైకుంఠపురములో` శరవేగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పాటలు .. పోస్టర్లతో టీమ్ హీటెక్కిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్ డేట్ కి బన్ని ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మునుముందు ప్రచారంలో ఇదే స్పీడ్ ని కొనసాగించేందుకు బన్ని టీమ్ ప్రిపరేషన్ లో ఉంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి బన్ని.. పూజా హెగ్డే పోస్టర్లు రిలీజై అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. అలాగే దసరా – దీపావళికి టోటల్ కీలక నటీనటుల పోస్టర్ ని రివీల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నివేద పెదురాజ్ పోస్టర్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. నేడు నివేద పుట్టినరోజు సందర్భంగా తనకు కానుక ఇది. నివేద స్వతహాగానే నేచురల్ బ్యూటీ. ఎక్కడా మేకప్ డామినేషన్ అన్నదే లేకుండా ఎంతో సింపుల్ గా కనిపిస్తుంది. ఎంత సింపుల్ గా ఉంటుందో అంత హట్ అప్పీల్ తో ఆకట్టుకుంది ఈ పోస్టర్ లో. సింపుల్ గా నవ్వేస్తూ ఆహ్లాదకరమైన ఎక్స్ ప్రెషన్ తో నివేద పెదురాజ్ మైమరిపిస్తోంది.

నివేద పాత్రకు అల పాత్రకు ఉండే రిలేషన్ ఏమిటి? బన్నితో నివేద పాత్రకు ఉండే బాండింగ్ ఎలాంటిది? ఇలాంటి సంగతుల్ని టీమ్ రివీల్ చేయాల్సి ఉంటుంది. నివేద పాత్ర సుశాంత్ లవ్ ఇంట్రెస్ట్ అన్న లీక్ అయితే ఉంది. అన్నట్టు అల పాత్రలో నటిస్తున్న పూజా హాట్ నా.. నివేద హాట్ గాళ్ నా? అన్నది థియేటర్ లో సినిమా చూశాక.. ప్రేక్షకులే డిసైడ్ చేయాల్సి ఉంటుంది.
Please Read Disclaimer