చక్కనమ్మ సొంతింటి కల నెరవేరేనా?

0

అందానికి అందం.. ప్రతిభ మలయాళీ బ్యూటీ నివేద సొంతం. ఆయిలీ మేకప్ తో కొత్తందాన్ని పరిచయం చేస్తోంది ఈ బ్యూటీ. ఇటీవల ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీఆల్మోస్ట్ సక్సెస్ సాధించినవే. నిన్ను కోరి- జై లవకుశ చిత్రాలతో విజయాలు అందుకుంది. 118 యావరేజ్ గా నిలిచింది. లేటెస్ట్ గా బ్రోచేవారెవరురా ఫర్వాలేదన్న టాక్ తెచ్చుకుంది. ఓవరాల్ గా నివేద మాత్రం తెలుగు సినిమాల్లో ఓ వెలుగు వెలుగుతోందనే చెప్పాలి.

అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి! అన్న ఫార్ములాని ఫాలో చేస్తోంది. జై లవకుశ తర్వాత చిన్న పాటి గ్యాప్ తీసుకున్నా టాలీవుడ్ పై చాలా కసిగా ఉన్నానని 118 ఇంటర్వ్యూల్లో చెప్పిన నివేద అందుకు తగ్గట్టే తెలివైన అడుగులు వేస్తోంది. ఒక్కో ఎంపిక సెలక్టివ్ గా ప్లాన్ చేస్తూ.. నవ్యపంథా కథలు.. పేరొచ్చే పాత్రల్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. తనకంటూ ఓ మార్క్ ఉందని నిరూపిస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్ పరిశ్రమలో పూర్తి స్థాయిలో బిజీ అయిపోతున్న నివేద ఇక్కడే సెటిలయ్యేందుకు ప్లాన్ చేస్తోందిట. అలా చేయాలంటే ముందు తనకు సొంతంగా ఓ ఇల్లు ఉండాలని భావిస్తోంది. అందుకే ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ పోష్ ఏరియాలో అదిరిపోయే అపార్ట్ మెంట్ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం అపార్ట్ మెంట్ కోసం సెర్చింగ్ లో ఉన్నానని చెప్పింది. ప్రస్తుతం బ్రోచేవారెవరురా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నివేద ఈ సంగతుల్ని రివీల్ చేసింది.
Please Read Disclaimer