ప్రేయసి రొయ్యల కూరకి లొట్టలేసాడట!

0

యంగ్ హీరో నిఖిల్ ప్రేమ వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. డాక్టర్ పల్లవి వర్మతో ఒక డీసెంట్ ఈవెంట్ లో ఎంగేజ్ మెంట్ చేసుకుని అభిమానులకు షాకిచ్చాడు. పెళ్లెప్పుడు? అని మీడియా ఎప్పుడు ప్రశ్నించినా అబ్బే అలాంటిదేమీ లేదు.. ఉంటే ముందు మీకే చెబుతాను అంటూ ఎస్కేప్ అయ్యేవాడు. కానీ సడెన్ గా పెళ్లి కుదిరిందంటూ ఝలక్ ఇచ్చాడు. కొన్నాళ్లుగా నిఖిల్-పల్లవి ప్రేమ పావురాల్లా జంట విహారం చేస్తున్నారు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్ధం చేసుకుని సగం పెళ్లయ్యిందనిపించేసారు. అటుపై జంట షికార్లు షరా మామూలే. అందుకే ప్రేమైక లోకంలో మధురానుభూతుల్ని ఒక్కొక్కటిగా లీకులిస్తూ అభిమానుల్ని ఊరిస్తున్నాడు నిఖిల్.

ఇప్పటికే గోవాలో తన ప్రేయసికి ఐ లవ్ యు చెప్పిన సన్నివేశం వివరించాడు. తాను మోకాళ్లపై కూర్చొని పువ్వుల్ని కానుకగా ఇస్తూ ప్రపోజ్ చేసిన ఫోటోలు నిఖిల్ షేర్ చేసాడు. అచ్చంగా సినిమాలో హీరో…హీరోయిన్ కు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందో? అలాంటి సన్నివేశమే అది. ప్రేమికులుగా ఒకరికి ఒకరు బహుమతులిచ్చుకోవడం సహజంగా జరిగేదే. అలా నిఖిల్ తన ప్రేయసికి ఖరీదైన ఐఫోన్ ప్రోమాక్స్ కొనిచ్చాడుట. ఇక బెంగూళూరులో పల్లవి మెడిసిన్ చదువుతోన్న సమయంలో ఇష్టమైన చాక్టెట్లు.. బొమ్మలు టెడ్డీ బేర్ లు కొనిచ్చాడు. ఇంకా ఇలాంటి బహుమానాలు మరెన్నో. ప్రేమపావురాలు సిలికాన్ సిటీ మొత్తాన్ని అలా చెట్టేసేవారట. మరి ప్రియుడికి ప్రేయసి అందించిన తొలి బహు మతి ఏమిటో అంటే ? నిఖిల్ కి ఎంతో ఇష్టమైన రొయ్యల కూరను స్వయంగా వండి అందించిందట. ఇంకేం ఉంది? నిఖిల్ లొట్టలేసుకుని రొయ్యల కూర లాగించేసాడుట. ప్రేమికులుగా ఉన్నప్పుడు ఇలాంటి మధురఘటనలు ఒకొరినొకరు అర్ధం చేసుకోవడానికి ఎంతో దోహదం చేస్తాయి. పెళ్లికి ముందే ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవించుకోవడం..తెలుసుకోవడం నేటి కల్చర్ లో ఓ భాగమైపోయింది.
Please Read Disclaimer