నెం.1 హీరో లెక్క తప్పింది

0

గత ఏడాది అయిదు సినిమాలు.. అంతకు ముందు రెండు సంవత్సరాలు నాలుగు సినిమాల చొప్పున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన స్టార్ అక్షయ్ కుమార్. ఈయన ఈ ఏడాది కూడా మూడు నాలుగు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశాడు. కాని కరోనా కారణంగా కేవలం ఒకే ఒక్క సినిమాను విడుదల చేయగలిగాడు. అది కూడా ఓటీటీ ద్వారా విడుదల అయ్యింది. గత ఏడాది అయిదు సినిమాల్లో అయిదు కూడా మంచి టాక్ ను దక్కించుకోవడంతో పాటు మంచి సినిమాలుగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి.

ఈ ఏడాది విడుదలైన ఏకైక సినిమా లక్ష్మి తీవ్రంగా నిరాశ పర్చింది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకపోవడమే మంచిది అయ్యింది అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా బాలీవుడ్ టాప్ హీరో.. నెం.1 హీరోగా కొనసాగుతున్న అక్షయ్ కుమార్ పరువు ఈ సినిమాతో పోయినట్లయ్యింది. సౌత్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా కాంచనను లక్ష్మిగా అక్షయ్ కళ్లు మూసుకుని చేశాడు. అదే ఆయన చేసిన తప్పు. అక్కడ హిట్ అయ్యింది కనుక ఇక్కడ హిట్ అవుతుందని భావించారు. కాని లెక్క తప్పింది. సినిమా నిరాశ మిగిల్చింది.