బర్త్ డే రోజూ అదే సైలేన్సా?

0

అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ ‘రుద్రమదేవి’ చిత్రంను తెరకెక్కించి విడుదల చేసి దాదాపుగా అయిదు సంవత్సరాలు అవుతుంది. అయినా ఇప్పటి వరకు గుణశేఖర్ కొత్త సినిమా ఏదీ కూడా పట్టాలు ఎక్కలేదు. రుద్రమదేవి విడుదల అయిన కొన్ని రోజులకే రానాతో సినిమా తీయబోతున్నట్లుగా గుణశేఖర్ ప్రకటించాడు. సురేష్ బాబు ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి భారీ బడ్జెట్ తో హిరణ్యకశిప సినిమాను గుణశేఖర్ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా చాలా నెలల క్రితం చెప్పాడు.

ఆ ప్రకటన వచ్చి చాలా నెలలు అయ్యింది. అయినా ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రకటన క్లారిటీ రాలేదు. అసలు ఆ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. లేదంటే మరేదైనా ప్రకటన వస్తే సినిమా కోసం జనాలు ఎదురు చూస్తూ ఉంటారు. కాని గత కొన్నాళ్లుగా ఎలాంటి ప్రకటన కూడా లేకపోవడంతో అసలు ఈ సినిమా ఉందనే నమ్మకంను కూడా జనాలు కోల్పోతున్నారు.

నేడు రానా బర్త్ డే. ఈ సందర్బంగా అయినా గుణశేఖర్ చిన్న ప్రకటన చేసి ఉంటే బాగుండేది అంటూ సినీ జనాలు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రానా అనారోగ్య కారణంతో ఎప్పుడో పూర్తి చేయాల్సిన విరాట పర్వం సినిమాను ఇంకా పూర్తి చేయలేదు. ఆ సినిమా పూర్తి అయితే దీన్ని ఏమైనా మొదలు పెడతాడేమో చూడాలి.
Please Read Disclaimer