విరామం లేదు.. విశ్రాంతి లేదు!

0

బాలీవుడ్ లో క్రమం తప్పకుండా హాటు ఫోటో షూట్లు చేసి భూగోళతాపాన్ని పెంచడంతో తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించే భామలు చాలామందే ఉన్నారు. వారిలో సీనియర్ బ్యూటీలు కూడా ఉన్నారు. ఆ సీనియర్లకు సోషల్ మీడియా మేట్ అమీషా పటేల్. ఈ భామ బాలీవుడ్ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ ‘బద్రి’.. మహేష్ బాబు ‘నాని’ సినిమాల్లో కూడా నటించింది. అమీషా వయసు ప్రస్తుతం నలభైలలో ఉంది. అయినా తన హాటు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బాలీవుడ్ గౌరవమర్యాదలను కాపాడుతోంది.

ఈమధ్య మరోసారి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అదేపని చేసింది. రెండు ఫోటోలను పోస్ట్ చేసి రెండు ఇంద్రధనుస్సుల ఎమోజీలు.. మూడు బ్లాస్ట్ ఎమోజీలను క్యాప్షన్ గా ఇచ్చింది. ఫోటోలలో అమీషా నేవీ బ్లూ కలర్ మినీ.. వైట్ కలర్ స్లీవ్ లెస్ టాప్ ధరించి వయ్యారంగా పోజులిచ్చింది. లేటు వయసు అయినా ఘాటుగానే కనిపిస్తోంది. పైగా కూలింగ్ గ్లాసెస్ ధరించి స్టైల్ ను కూడా రంగరించింది. రోజూ ఎంత కఠినమైన ఎక్సర్ సైజులు చేస్తోందో కానీ ఇంకా సూపర్ ఫిట్ గా ఉంది.

అంతా బాగానే ఉంది కానీ ఈ భామకు ఈ జెనరేషన్ ఆడియన్స్ లో.. నెటిజన్ల లో క్రేజ్ పెద్దగా లేదు. ఈ ఫోటోలు అరవై వేల లైక్స్ వచ్చాయి కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా కామెంట్ పెట్టలేదు. అయినా అలాంటివాటికి జంకే వ్యవహారంలా కనిపించడం లేదు అమీషా తన హాటు ఫోటోల పరంపరను ఇప్పట్లో ఆపేలా లేదు. ఇక సినిమాల విషయానికి వస్తే అమీషా ప్రస్తుతం ‘దేశి మ్యాజిక్’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.
Please Read Disclaimer