బ్రేక్ లేకుండా బరిలోకి దిగబోతున్న బాలయ్య

0

ఈ ఏడాది ఆరంభం లో బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ రెండు పార్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల ను మాత్రమే కాకుండా బాలయ్య ను కూడా తీవ్రంగా నిరాశ పర్చాయి. ఎన్టీఆర్ ఆకట్టుకోక పోవడంతో బాలకృష్ణ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఆ వెంటనే ఎన్నికలు రావడంతో బాలయ్య తదుపరి చిత్రం ఇంకాస్త ఆలస్యం అయ్యింది. ఎన్నికల హడావుడి తర్వాత బాలయ్య తన 105వ చిత్రాన్ని కేఎస్ రవికుమార్ దర్శకత్వం లో చేశాడు.

‘రూలర్’ టైటిల్ తో చాలా తక్కువ సమయం లోనే బాలయ్య 105వ చిత్రం పూర్తి అయ్యింది. డిసెంబర్ 20వ తారీకున రూలర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరిగి పోతున్నాయి. బాలయ్య రూలర్ చిత్రం తర్వాత చేయబోతున్న సినిమా ఏంటీ అనేది ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. బోయపాటి దర్శకత్వం లో బాలయ్య 106వ చిత్రం ఉండబోతుంది. ఇప్పటికే బోయపాటి అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గా తెలుస్తోంది.

రూలర్ సినిమా విడుదలకు ముందే అంటే డిసెంబర్ మొదటి లేదా రెండవ వారంలోనే బోయపాటి తో మూవీని బాలయ్య ప్రారంభించబోతున్నాడు. రూలర్ తర్వాత ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా.. కనీసం ఆ సినిమా ఫలితాన్ని కూడా పట్టించుకోకుండా తన తదుపరి చిత్రాన్ని బాలయ్య చేయబోతున్నాడు. బాలయ్య బోయపాటి ల కాంబోలో ఇప్పటి కే సింహా మరియు లెజెండ్ చిత్రాలు వచ్చాయి. ఈ సారి రాబోయేది వీరి కాంబోకు హ్యాట్రిక్ గా నిలుస్తుందనే నమ్మకం ను నందమూరి ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కు బాలయ్య 106 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయట.
Please Read Disclaimer