యాక్షన్ సినిమాకు నో బిజినెస్.. నో థియేటర్స్!

0

కోలీవుడ్ హీరో విశాల్ నటించే అన్నీ సినిమాలు దాదాపుగా తెలుగు లో విడుదల అవుతాయి. విశాల్ ఎక్కువగా మాస్ యాక్షన్ ఫిలిమ్స్ చేస్తాడు కాబట్టి ఆ జోనర్ ను ఇష్టపడే ప్రేక్షకులు విశాల్ సినిమాను మిస్ చేయకుండా చూస్తారు. గతంలో విశాల్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. విశాల్ నటించిన ప్రతి సినిమాకు మినిమమ్ రెండున్నర కోట్ల షేర్ వచ్చేది కానీ ఈమధ్య విశాల్ నటించిన సినిమాల లో దాదాపుగా అన్నీ నిరాశపరిచాయి. దీంతో విశాల్ మార్కెట్ పూర్తిగా తగ్గిపోయిందని.. విశాల్ కొత్త సినిమాకు బిజినెస్ జరగడం లేదని టాక్.

విశాల్ నటించిన ‘యాక్షన్’ నవంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు మరో వారం కూడా లేదు.. అయినా బిజినెస్ కావడం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే ‘యాక్షన్’ టీమ్ ప్రమోషన్స్ పై అసలు ఏ మాత్రం ఫోకస్ చేయక పోవడం తో ఈ సినిమా రిలీజ్ అవుతోందనే సంగతి ఎవరి కీ పెద్దగా తెలియదు. తెలుగులో పరిస్థితి ఇలా ఉంటే విశాల్ సినిమా కు తమిళంలో కూడా పరిస్థితి పెద్దగా అనుకూలం గా లేదు. విశాల్ సినిమా కు అక్కడ థియేటర్స్ దొరకడం లేదట. దీపావళి సీజన్ లో రిలీజ్ అయిన విజయ్ ‘బిగిల్’.. కార్తి ‘ఖైదీ’ సినిమాలు ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకు పోతున్నాయట. దీంతో విశాల్ సినిమా తక్కువ థియేటర్ల తో సరిపెట్టుకోవాల్సి వస్తోందట.

మరి ఇలాంటి సమయం లో రిలీజ్ కానున్న ‘యాక్షన్’ ప్రేక్షకులను ఎంతమాత్రం మెప్పిస్తుందో వేచి చూడాలి. ఖుష్బూ భర్త సుందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీలో విశాల్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో మరో కీలక పాత్ర లో నటిస్తోంది. హిప్ హాప్ తమిళ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Please Read Disclaimer