కొంపదీసి కీర్తి లైట్ తీస్కుందా?

0

మహానటి లాంటి బ్లాక్ బస్టర్ తో పాన్ ఇండియా నటిగా పాపులరైంది కీర్తి సురేష్. ఈ మలయాళ బ్యూటీ నటనలో శిఖరం ఎత్తుకు ఎదిగేసిందంటూ ప్రశంసలు కురిసాయి. అయినా ఏం లాభం? ఆ తర్వాత అసలు కీర్తికి సరైన రూట్ అన్నదే ఏర్పడలేదు. ఏవో కొన్ని కమర్షియల్ సినిమాల్లో నటించి ట్రాక్ మార్చాలని చూసినా ఎందుకనో కలిసి రాలేదు.

ఆ క్రమంలోనే అటు బాలీవుడ్ కి వెళ్లి అక్కడ పెద్ద స్టార్ సినిమా లో నటించేస్తోంది. ఇక ఇటు మిస్ ఇండియా అంటూ ఒక సినిమాని చేస్తోంది. మహానటి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నరేంద్ర నాధ్ దర్శకత్వంలో `మిస్ ఇండియా` తో సత్తా చాటుతుందా? అని ఎదురు చూస్తే .. జనాలకు ఈ అమ్మడు ఎక్కడా కనిపించిందే లేదు. అసలు పబ్లిసిటీ ఏమైంది? ఏవో రెండు మూడు పాటలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసి మమ అనిపించేశారు. దీంతో అసలు ఆ సినిమా ఉందో లేదో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. కొంపదీసి కీర్తి కానీ ఈ సినిమాని లైట్ తీస్కుందా ఏంటి? అన్న చర్చ ఫిలింసర్కిల్స్ లో సాగుతోంది. జమానా కాలంలో డబ్బింగ్ మొదలెట్టారని ప్రచారమైంది. కానీ ఏదీ సౌండ్?

అసలింతకీ కీర్తికి ఏమైంది? ఎందుకనో బొత్తిగా అసలు కనిపించకుండా పోయింది? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు ఫిలింసర్కిల్స్ లో అసలే కనిపించడం లేదు. చోటా మోటా కథానాయికలు అంతగా గర్తింపు లేని భామలే ఇక్కడ బోలెడంత హడావుడి చేసేస్తుంటే కీర్తి ఎందుకనో చప్పబడిపోయింది. ఒకవేళ టాలీవుడ్ ని లైట్ తీస్కుందేమో అని డౌట్లు పుట్టుకొచ్చేలా ప్రవర్తిస్తోంది. ఇంతకీ మిస్ ఇండియా ఉన్నట్టా లేనట్టా?
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-