క్లారిటీ మిస్ అవుతున్న సుకుమార్

0

రంగస్థలం లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత ఏడాది గ్యాప్ రావడం అంటే సుకుమార్ లాంటి టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్స్ కు ఇబ్బంది కలిగించేదే. అందులోనూ చేతిదాకా వచ్చింది నోటిదాకా రాలేదు అనే తరహాలో మహేష్ బాబు సినిమా చేజారిపోవడం సుక్కు ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. సరే అది పోతే పోయింది బన్నీ ఒప్పుకున్నాడు కదా అని సంతోషించే లోపు అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అర్థం కాక అయోమయం కొనసాగుతోంది.

ఇన్ సైడ్ టాక్ చూస్తేనేమో త్రివిక్రమ్ సినిమా ఫినిష్ చేశాక బన్నీ నెక్ట్ వేణు శ్రీరామ్ ఐకాన్ షూటింగ్ మొదలుపెడతాడని టాక్ ఉంది. అదే నిజమైతే ఇంకో సంవత్సరం ఎదురు చూపులు తప్పవు. ఈలోగా సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబోలో సినిమా వచ్చే ఛాన్స్ ఉందని కొత్త గాసిప్ మొదలైంది. దానికి కారణం ఆనంద్ దేవరకొండ డెబ్యూ మూవీ దొరసాని ట్రైలర్ రిలీజ్ చేయడానికి సుకుమార్ ఒప్పుకోవడమట. విజయ్ కోరడం వల్లే సుకుమార్ ఓకే చెప్పడానికి ఎలాగూ ఇద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు కాబట్టి ఇది సాధ్యమైందని చెబుతున్నారు.

నిజానికి దీనికి ఇంత లోతైన రీజన్ లేదు. వేరే కోణం ఉంది. సుకుమార్ తో రంగస్థలం తీసింది ఇప్పుడు అల్లు అర్జున్ తో తీయబోయేది విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తో పార్టనర్ గా ఉంది మైత్రి సంస్థే. దొరసాని నిర్మాతల్లో ఒకరైన యష్ రంగినేని డియర్ కామ్రేడ్ లో కూడా భాగస్వామి. ఈ బాండింగ్ లో భాగంగా సుకుమార్ వాళ్ళ డీల్స్ లో ఉన్నాడు కాబట్టి ట్రైలర్ లాంచ్ చేయిస్తున్నారు తప్ప విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నాడు కాబట్టి ప్రాజెక్ట్ ఓకే అయ్యింది అనడంలో లాజిక్ లేదు. ఏదో ఒకటి సుకుమార్ అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తూ ఉంటె ఇలాంటివాటికి ఛాన్స్ ఉండదు.
Please Read Disclaimer