ప్రభాస్ నిర్మాతలు మళ్లీ అదే తప్పు చేస్తున్నారే

0

బాహుబలి ప్రాంచైజీ తో స్టార్ గా ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగాడు ప్రభాస్. అయితే ఆ అంచనాలతోనే సాహో విషయంలో ఎంతో కేర్ తీసుకొని ఏదో చేయాలనీ చూసి చివరికి ఏదో చేసారు ప్రభాస్ నిర్మాతలు. సినిమా స్టార్టింగ్ టైం లో ఓ మ్యూజిక్ డైరెక్టర్ అనుకోని ఆ తర్వాత మళ్ళీ వారిని వద్దనుకొని పోస్టర్స్ లో ఎవరి పేరు వేయకుండా ఏదేదో చేసారు.

దీంతో సాహో మ్యూజిక్ అంతగా క్లిక్ అవ్వలేదు. నిర్మాతలు అనుకునంత స్తాయికి ఆ పాటలు చేరలేదు. సినిమా లో పరవాలేదనిపించాయి కానీ బయట పెద్దగ క్లిక్ అవ్వలేదు. కాకపోతే ప్రభాస్ కి ఉన్న క్రేజ్ తో యూ ట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకున్నాయి. అయితే ఇప్పుడు మరోసారి అదే తప్పు చేస్తున్నారు నిర్మాతలు. ప్రభాస్ నెక్స్ట్ సినిమాకు మ్యూజిక్ ఎవరనేది ఇంత వరకూ బయటికి రాలేదు.

అసలు ఎవరు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారో మీడియా ప్రతినిధులకు కూడా తెలియని పరిస్థితి. తక్కువ ఆడియన్స్ ని అడిగితే తెల్లమొఖం వేసే పరిస్థితి. కనీసం ఫస్ట్ లుక్ తో అయినా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది చెప్తారో లేదో చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-