రాజ్ దూత్ కి సౌండ్ ఏది బాస్ ?

0

రేపు విడుదల కానున్న సినిమాల్లో చాలా తక్కువ హైప్ తో వస్తున్న మూవీ రాజ్ దూత్. రియల్ స్టార్ శ్రీహరి వారసుడు మేఘంష్ ని తెరకు పరిచయం చేస్తూ తీసిన ఈ మూవీ అసలు రేపు విడుదల ఆవుతోందన్న సంగతే చాలా మంది ప్రేక్షకులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. శ్రీహరి మీద జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ అభిమానులు ఉన్నారు. అలాంటిది ఆయన అబ్బాయి మొదటి సినిమా అంటే హైప్ ఓ రేంజ్ లో ఉండాలి. కాని అలాంటి ఊసేది రాజ్ దూత్ విషయంలో కనిపించడం లేదు.

సోషల్ మీడియాలో దర్శకుల సహాయంతో వీడియో బైట్స్ రూపంలో పోస్టులు పెట్టడమే తప్ప అంతకు మించి ప్రమోషన్ కనిపించడం లేదు. పోటీలో ఉన్న దొరసాని-నిను వీడని నీడను నేనే ఈ విషయంలో రాజ్ దూత్ కంటే చాలా ముందంజలో ఉన్నాయి. కాని రాజ్ దూత్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసినా అలాంటి బజ్ కనిపించడం లేదు. ఈ లెక్కన రేపు ఓపెనింగ్స్ నీరసంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిసి కేంద్రాల్లోనే కాదు ఏ సెంటర్స్ లో సైతం అడ్వాన్సు బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయని ట్రేడ్ రిపోర్ట్.

రేపు బ్రహ్మండం అనే టాక్ వస్తే తప్ప అంతో ఇంతో పికప్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాదని యావరేజ్ అని వచ్చినా మిగలిన సినిమాలతో పోటీ పడి వసూళ్లు రాబట్టుకోవడం అంత ఈజీ కాదు. మేఘంష్ శ్రీహరి అబ్బాయిగా వస్తున్నాడనే మెసేజ్ ని జనంలోకి తీసుకెళ్ళడంలో రాజ్ దూత్ టీం ఫెయిల్ అయ్యింది. బడ్జెట్ పరిమితా ఇంకో కారణమా తెలియలేదు కాని ఇలాంటి స్ట్రాటజీతో ఓపెనింగ్స్ వర్క్ అవుట్ చేసుకోవడం కష్టం. టైటిలేమో పవర్ ఫుల్ గా రాజ్ దూత్ అని పెట్టారు. తీరా చూస్తే దానికి తగ్గ సౌండ్ మాత్రం రావడం లేదు.
Please Read Disclaimer