ఫోటోలు ఓకే.. సినిమాలు ఏవి లావణ్యా?

0

అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ లావణ్య త్రిపాఠి. ఆ సినిమా లావణ్య త్రిపాఠికి మంచి గుర్తింపే తీసుకొచ్చింది. తర్వాత ‘భలే భలే మగాడివోయ్’ లాంటి మంచి హిట్లు రావడంతో ఇక స్టార్ హీరోయిన్ కావడమే నెక్స్ట్ అని చాలామంది అనుకున్నారు. అందుకే హాట్ గేరు కూడా వేసింది. అయితే కెరీర్ కీలకదశలో ఉన్న సమయంలో వరసగా అరడజను ఫ్లాపులు తగలడంతో ఆఫర్లు కూడా తగ్గాయి.

ఈ సమయంలో పోయినేడాది రిలీజ్ అయిన ‘అర్జున్ సురవరం’ హిట్ గా నిలిచింది. అయితే సురవరం హిట్ అయినా ఫిలింమేకర్ల నుండి ఆఫర్ల వరాల జల్లు మాత్రం కురవడం లేదు. దీంతో సోషల్ మీడియాలో తన హాటు ఫోటో షూట్లతో హీటు పెంచి అంతర్జాల ఉష్ణోగ్రతలను ఉస్కో అనిపించాలని కంకణం కట్టుకుంది. ఈ హాటు బిజినెస్సు అంతా బాగానే ఉంది కానీ ఆఫర్ల విషయంలో మాత్రం పాజిటివ్ సిగ్నల్స్ రావడం లేదట. స్టార్ హీరోల సినిమాలకు ప్రస్తుతం లావణ్య పేరును పరిశీలించడం లేదు. ఇక మిగిలింది మీడియం రేంజ్ హీరోలు. ప్రస్తుతం లావణ్య దర్శకుడు పరశురామ్ పైనే నమ్మకాలు పెట్టుకుని ఉందట.

లావణ్య గతంలో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ పరిచయంతోనే పరశురామ్ – నాగ చైతన్య ప్రాజెక్టులో సెకండ్ హీరోయిన్ గా అయినా అవకాశం వస్తుందని ఆశలు పెట్టుకుందట. మరి ఆ ఆఫర్ వస్తుందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. కొత్త ఆఫర్ల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం లావణ్య ‘A1 ఎక్స్ ప్రెస్’ అనే సినిమాలో నటిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-