హాట్ ఫొటో షూట్స్ చేసినా తెలుగమ్మాయిని పట్టించు కోవడం లేదు

0

తెలుగు లో తెలుగమ్మాయిలకు హీరోయిన్ గా ఛాన్స్ లు రావంటూ మనం పదే పదే వింటూనే ఉన్నాం. ఇప్పుడు తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మొదటి సినిమా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ట్యాక్సీవాలా’ చేసింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు హీరోయిన్ చక్కగా ముద్దుగా ఉందే అంటూ కామెంట్స్ వచ్చాయి. మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి అంటూ ప్రచారం కూడా జరిగింది.

ట్యాక్సీవాలా చిత్రం తర్వాత ఈ అమ్మడు వరుసగా హాట్ ఫొటో షూట్స్ చేయడంతో పాటు ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తూ వస్తుంది. అయినా కూడా ఈమెను తెలుగు ఫిల్మ్ మేకర్స్ పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రియాంక జవాల్కర్ తెలుగు అమ్మాయి కాకుండా ఉంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు కనీసం రెండు మూడు సినిమాలు అయినా చేసేది. చిన్న లేదా పెద్ద హీరోల తో ఈమె కు అవకాశాలు వచ్చేవి. కాని తెలుగమ్మాయి అవ్వడం వల్లనే ఈమె కు ఆఫర్లు రావడం లేదు.

చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా అనిపించడంతో పాటు చక్కని ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వగల ఈ అమ్మడికి అవకాశాలు రాకపోవడంపై కొందరు నెటిజన్స్ సినీ జనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు అమ్మాయిలు అందం మరియు అభినయం కలిగి ఉన్నా కూడా ఎందుకు మీరు పట్టించుకోరు అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రియాంక జవాల్కర్ చూడ్డానికి ఉత్తరాది ముద్దు గుమ్మ ఉన్నట్లుగా ఉంటుంది. అయినా కూడా ఛాన్స్ లు రావడం లేదు. ముందు ముందయినా ఈమెకు ఆఫర్లు వస్తాయేమో చూడాలి.
Please Read Disclaimer