ఆర్డీఎక్స్ పాప.. కెరీర్ డల్ గా ఉందే!

0

‘RX100’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన భామ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా పాయల్ కు భారీ గుర్తింపు దక్కింది. ఇలా హిట్ తగిలినా చాలామంది హీరోయిన్లు బోల్డ్ ఇమేజ్ కోసం తంటాలు పడుతుంటారు. అయితే పాయల్ కు అలాంటి కష్టం లేకుండా మొదటి సినిమాతోనే ఘాటు ఇమేజ్ తెచ్చుకుంది. యూత్ లో కూడా పాయల్ కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత చేసిన సినిమాలు నిరాశపరచడంతో మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్ కాస్తా పోయింది. ముఖ్యంగా ‘RDX లవ్’ సినిమా పాయల్ క్రేజ్ ను దెబ్బతీసింది.

అయితే ఈ సమయంలో పాయల్ కు ‘వెంకీమామ’ రూపంలో మంచి హిట్ దక్కింది. డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలో పాయల్ సీనియర్ హీరో వెంకటేష్ కు జోడీగా నటించింది. సినిమా హిట్ అయినా పాయల్ కు పెద్దగా ఒరిగింది ఏమీ లేదని అంటున్నారు. సహజంగా కెరీర్ ఆరంభంలో సీనియర్ హీరోలతో జోడీ కడితే ఆ హీరోయిన్లతో రోమాన్స్ చేసేందుకు యువ హీరోలు ఆసక్తి చూపరు. ప్రస్తుతం పాయల్ పరిస్థితి కూడా అలానే ఉందట. ఏజ్ బార్ అయిన హీరోలకు జోడీ దొరక్క పాయల్ ను ఎంపిక చేసుకోవాల్సిందే కానీ యువ హీరోలు ఎవ్వరూ పాయల్ పేరును తమ సినిమాలకు పరిశీలించడం లేదట. దీంతో షాప్ ఒపెనింగులు.. ఛారిటి షోలు అంటూ అటూ ఇటూ తిరుగుతూ లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నం చేస్తోంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫిలిం మేకర్ల కు ఫీలర్లు పంపిస్తోంది.

పాయల్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి మాస్ మహారాజా రవితేజ సినిమా ‘డిస్కోరాజా’ మరొకటి తమిళ చిత్రం ‘ఏంజెల్’. రవితేజ సినిమా కనుక హిట్ అయితే పాయల్ కెరీర్ కు కొంచెం ఊపు వస్తుందేమో వేచి చూడాలి. లేకపోతే ఇక ఫేడ్ అవుతున్న ఇతర హీరోయిన్ల తరహాలో వెబ్ సీరీస్ వైపు చూడాల్సి ఉంటుంది.
Please Read Disclaimer