స్టార్ హీరోకు ఇలాంటి పరిస్థితా ?

0

తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైనా సరైన గుర్తింపు లేక చెన్నై వెళ్లి అక్కడ వరసగా మూవీస్ చేసుకుంటూ అపరిచితుడు డబ్బింగ్ వెర్షన్ రూపంలో మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్న విక్రం చాలా ఏళ్ళు ఇక్కడ మంచి మార్కెట్ దక్కించుకున్నాడు. అతని సినిమా వస్తోంది అంటే పోటీగా వెళ్ళడానికి స్టార్ హీరోలు సైతం ఆలోచించేవారు. అందుకే మాములు కంటెంట్ ఉన్న విక్రం సినిమాలతో లాభాలు కళ్ళజూసిన నిర్మాతలు అప్పట్లో చాలా ఉన్నారు. అంతదాకా ఎందుకు శంకర్ ఐకు సైతం ఉదయం బెనిఫిట్ షోలు వేస్తే ధియేటర్లు కిక్కిరిసిపోయాయి.

ఇదంతా గతం. ఇప్పుడు విక్రం మార్కెట్ జీరోకు వచ్చేసింది. తన కొత్త సినిమా రిలీజ్ అవుతోంది అంటే ఫాన్స్ సైతం పట్టించుకోవడం మానేశారు. కారణం అన్ని ఫలితాలు ఒకేలా ఉండటం. ఇప్పుడు మిస్టర్ కేకే రాబోతోంది. లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీని ఇక్కడ కనీసం ఎవరు పట్టించుకునే దాఖలాలు కూడా ఉండేలా లేవు. పూరి-రామ్ ల కాంబోలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ తో పోటీకి దిగుతోంది.

మిస్టర్ కేకె ట్రైలర్ వచ్చిన సంగతే ఎవరికీ తెలియదు. ఇది కొత్త సినిమానా లేక పాతదా అనే అయోమయంలో కొందరు ప్రేక్షకులు ఉన్నారు. పబ్లిసిటీ అంతంత మాత్రంగానే ఉంది. ఏదో హాలీవుడ్ మూవీకి ట్రూ జిరాక్స్ లా రూపొందిన మిస్టర్ కేకే టైటిల్ కూడా ఆసక్తి రేపెలా లేకపోవడం మరో మైనస్. ఇవన్ని చూస్తుంటే సినిమా బాగున్నా లేకపోయినా మరోసారి రిజల్ట్ రిపీట్ అయ్యేలా ఉంది. ఎలాంటి విక్రం ఎలా అయిపోయాడు అని స్వంత అభిమానులే బాధ పడే పరిస్థితి వచ్చింది
Please Read Disclaimer