వరల్డ్ ఫేమస్ లవర్ లో విషయం చెప్పేసింది

0

అందానికి అందం.. అభినయానికి ఏ మాత్రం లోటు లేనప్పటికీ కేథరిన్ కు అవకాశాలు కాస్త తక్కువనే చెప్పాలి. అయితే.. ఆమెకు ఆఫర్లు వచ్చినా.. ఓకే చెప్పే విషయంలో ఆమె అనుసరించే పద్దతే దీనికి కారణంగా కొందరు చెబుతుంటారు. ఈ వాదనను బలపర్చేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందీ ముద్దు గుమ్మ. తనకు ఒక సినిమా లో చేసిన పాత్ర మాదిరే మరో సినిమాలో ఆఫర్ ఇస్తే నో చెబుతానని.. ఇది తన అలవాటుగా చెప్పింది.

ఆమె నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. విజయదేవర కొండతో స్క్రీన్ షేర్ చేసుకున్న కేథరిన్.. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ.. అందరికి సమాన ప్రాధాన్యత లభించిందని.. పాత్ర చిన్నదే అయినా.. ప్రతి ఒక్కరికి కథలో ప్రయారిటీ ఉంటుందని చెప్పింది.

ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు నటించినా.. ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటం ఈ సినిమా ప్రత్యేకత గా చెప్పిన ఆమె.. నలుగురు హీరోయిన్లు కలిసే సీన్ ఉండవని చెప్పేసింది. మిగిలిన ముగ్గురు హీరోయిన్లలో ఏ ఒక్కరితో కలిసిన సీన్ చిత్రంలో లేదని చెప్పింది. దీంతో.. వరల్డ్ ఫేమస్ లవర్ లో.. జీవితం లో వివిధ దశల్లో విజయ దేవరకొండ ప్రేమలో పడే అమ్మాయిల్లో ఒకరిగా కేథరిన్ పాత్ర ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో వారం ఆగితే.. పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.
Please Read Disclaimer