‘వకీల్ సాబ్’ సర్ప్రైజ్ ఏమీ లేనట్లేనా?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. సోషల్ మీడియాలో మరోసారి సందడికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. బర్త్ డే కామన్ డీపీ విడుదల సందర్బంగా వారు చేసిన సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు పుట్టిన రోజున వకీల్ సాబ్ టీజర్ లేదా పాట వస్తే చూడాలని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది కనుక పాట కాని టీజర్ కాని విడుదల చేసే అవకాశం లేదంటున్నారు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎక్కువగా పాటలు ఉండవు. ఇదో కమర్షియల్ సినిమా కాదు కనుక పవన్ పుట్టిన రోజుకు ఒక మాస్ మసాలా విడుదల చేసే అవకాశం థమన్ కు లేకుండా పోయింది. అయినా కూడా తనకు తోచిన విధంగా ఏదో ఒకటి అయినా థమన్ నుండి పవన్ బర్త్ డే గిఫ్ట్ ఆ వస్తుందని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి స్పందన అయితే లేదు. వకీల్ సాబ్ సినిమా మోషన్ పోస్టర్ విడుదల విషయంలో కూడా రేపు లేదా ఎల్లుండి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక క్రిష్ మూవీ ఇంకా షూటింగ్ కూడా మొదలు పెట్టలేదు కనుక ఫస్ట్ లుక్ కాని మరేది కాని వచ్చే అవకాశం లేదంటున్నారు.