అదే మీరిచ్చే గొప్ప బహుమతి: ఎన్టీఆర్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బృందం ఏదైనా ఎన్టీఆర్ సర్ప్రైజ్ వీడియో లేదా ఫస్ట్ లుక్ విడుదల చేస్తుందని అభిమానులంతా కోటి ఆశలతో ఎదురు చూసినందుకు తీవ్ర నిరాశ తప్పలేదు. టీజర్ లాంటి వీడియో ఫస్ట్ లుక్ పోస్టర్ రూపొందించడం వీలు కాలేదని.. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎలాంటి టీజర్ రిలీజ్ చేయడం లేదని ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ ప్రకటించడం అభిమానులను ఎంతో అసంతృప్తికి గురిచేసింది. అభిమానులను ఉద్దేశించి.. ఫస్ట్ లుక్ స్పెషల్ వీడియో పై ఎన్టీఆర్ లేఖ రూపంలో స్పందించాడు. “మీ ఆనందం కోసం ఫస్ట్ లుక్-టీజర్ సిద్ధం చేయాలని చిత్రబృందం ఎంత శ్రమించిందో నాకు తెలుసు. కానీ ఓ ప్రమోషనల్ వీడియో మీ ముందు ఉండాలంటే అన్ని సాంకేతిక విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. లాక్ డౌన్ కారణంగా అది సాధ్యపడలేదు.

అందుకే ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి ఎలాంటి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కావడం లేదు. మీరెంత నిరాశకు గురవుతారో నేను అర్థం చేసుకోగలను” అంటూ సోషల్ మీడియాలో ఓ సందేశం పోస్టు చేశారు. అయితే ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు చూపించే ప్రేమ వారు చేపట్టే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తానని కానీ ఈసారి అభిమానులు అందరూ ఇంటి వద్దే ఉంటూ అధికారుల సూచనలు పాటిస్తూ భౌతికదూరం నిబంధనకు కట్టుబడి ఉండాలన్నదే తన విన్నపం అని తెలియజేశారు. ఇదే మీరు నాకు ఇచ్చే అతి విలువైన బహుమతి అంటూ సందేశం అందించారు. నిజానికి ఈసారి ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఓ రేంజ్ లో జరుపుకోవాలని ఫ్యాన్స్ ఆత్రంగా వెయిట్ చేశారు. ఇక మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని ఆర్ఆర్ఆర్ యూనిట్ ఎన్టీఆర్ పోస్టుల రూపంలో చెప్పేసరికి తీవ్రంగా నిరాశకు గురయ్యారని అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి మళ్లీ ఏదైనా సమాచారం అందిస్తారేమో..!Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home