‘రంగ్ దే’ సౌండేది.. అసలేమైంది?

0

ఒకప్పటితో పోలిస్తే ప్రచార సరళి మారింది. అన్ని సినిమాలకు ప్రచారం ఒకేలా లేదు. కొన్నిటిని దాచేస్తుంటే కొన్నిటిని మాత్రం ఓపెన్ చేస్తూ ప్రచారం వేడెక్కిస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో ప్రచారం మేకర్స్ చేతిలోకి వచ్చేయడంతో ట్విట్టర్.. ఇన్ స్టాల్ని తమ ఇష్టానుసారం వాడుకుంటూ అసలు మీడియాలకి ఝలక్ ఇస్తున్నారు.

అయితే అసలేమైందో కానీ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న `రంగ్ దే`కి సంబంధించిన ఒక్క అప్ డేట్ కూడా లేదు. అసలింతకీ ఆ సినిమా సెట్స్ పై ఉందా లేదా? అన్న సందేహం వచ్చేంతగా సైలెన్స్ మెయింటెయిన్ చేస్తోంది టీమ్. నితిన్- కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్రివిక్రమ్ చేతులమీదుగా దసరా రోజున ఓపెనింగ్ చేశారు .. అయితే ఆ తర్వాత అసలేమైందో సైలెంట్ అయ్యారు. అసలింతకీ ఓపెనింగ్స్ తర్వాత తాజా సంగతులేమిటో తెలియనే లేదు. షెడ్యూల్స్ ఏమిటో కూడా వెల్లడించనే లేదు.

సోషల్ మీడియా విప్లవం రాకముందు ప్రత్యేకించి మీడియాకి ప్రతి దశలోనూ ఓపెనింగ్ అయిన సినిమాకి సంబంధించిన ప్రతి సమాచారం అందించేవారు. ఫోటోలు సహా వివరాలు అందేవి. తొలి షెడ్యూల్ అయ్యింది. రెండో షెడ్యూల్.. మూడో షెడ్యూల్.. అయినా.. ముగింపులో గుమ్మడి కాయ కొట్టినా చెప్పేవారు. ప్రతిసారీ ఏదో ఒకటి చెప్పేవారు. అందువల్లనే ఆ సినిమాలకు కావాల్సినంత ప్రచారం దక్కేది. బాగా ఆడేవి కూడా. కానీ ఇప్పుడలా లేదు. ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ఏదో ఒకటి ప్రకటించేసి సైలెంట్ అయిపోతున్నారు. అది తెలిసిన వారికి తెలిస్తే తెలియొచ్చు. లేదంటే అసలేమైంది అట్నుంచి సౌండే లేదే అని సందేహం కలగనూ వచ్చు. ఇలా ఉంది రంగ్ దే సీన్. 2020 సమ్మర్ ట్రీట్ అన్నారు. అయినా ఏదీ అప్ డేట్? అసలింతకీ రంగ్ దే షూటింగ్ తాజా షెడ్యూల్ సంగతేమిటో?
Please Read Disclaimer