పూరి డిస్కవరీ ఇంతకీ ఏమైనట్టు?

0

కొత్త భామల్ని పరిశ్రమకు పరిచయం చేయాలంటే పూరి జగన్నాథ్ తర్వాతే ఎవరైనా. తనయుడు ఆకాష్ పూరి సరసన `రొమాంటిక్` చిత్రంతో మరో కొత్త భామను పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా ముంబై టాప్ మోడల్ ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. ఈ భామ పేరు కేతిక శర్మ. టీవీ నటిగా సుపరిచితం. ఇప్పటికే `రొమాంటిక్` కొంత భాగం షూటింగ్ చేశారు. అయితే మధ్యలో బ్రేక్ ఇచ్చి అటుపై రామ్ హీరోగా స్వీయదర్శకత్వంలోని `ఇస్మార్ట్ శంకర్`పైనే దృష్టి సారించాడు పూరి. ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ చిత్రం రిలీజై బ్లాక్ బస్టర్ కొట్టింది కాబట్టి తిరిగి ఈ ఉత్సాహంలో తనయుడి సినిమాపై దృష్టి సారిస్తాడని భావిస్తే .. ఆ వెంటనే రౌడీతో ప్రాజెక్టు బిజీలో పడిపోయాడు. దీంతో రొమాంటిక్ గురించి నిర్మాతగా పూరి అప్ డేట్ ఏమిటో తెలియడం లేదు.

రొమాంటిక్ సెట్స్ నుంచి ఇదివరకూ నిర్మాత ఛార్మి కొన్ని ఫోటోల్ని రివీల్ చేసింది. అందులో ఆకాశ్ తో పాటు కేతిక శర్మ కనిపించింది. అంతకు మించి మూవీ నుంచి కొత్త లుక్ ఏదీ రిలీజ్ చేయలేదు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఈ లుక్ కి మాత్రం యువతరం నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఇటీవల మరో కొత్త అప్ డేట్ అయితే లేనేలేదు. కేతిక ఇన్ స్టాగ్రమ్ లో స్పీడ్ గానే ఉంటోంది. అక్కడ నిరంతరం కొత్త కొత్త ఫోటోలు – వీడియోల్ని షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంది. కేతిక ఇటీవలే జిమ్ముల్లో కసరత్తులు చేస్తున్న రకరకాల వీడియోలతోనూ వేడి పెంచింది. ప్రస్తుతానికి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో శర్మా గాళ్ కి టచ్ లో ఉన్నారు.

తాజాగా ఇన్ స్టాలో కేతిక ఓ కొత్త ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో రెడ్ హాట్ లుక్ తో కనిపించి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. `కిచెన్ డైరీస్` పేరుతో కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్ ఇది. ఈ లుక్ లో కొత్తమ్మాయ్ హాట్ అప్పియరెన్స్ కట్టి పడేస్తోంది. కేతిక వస్తే టాలీవుడ్ ని ఊపేస్తుందా? అన్నంత కసిగానే కనిపిస్తోంది మరి. అయితే ఎందరో హాట్ భామల్ని పూరి తెలుగు తెరకు పరిచయం చేసినా కొందరే నిలదొక్కుకోగలిగారు. మరి ఆ జాబితాలో కేతిక పేరు నిలుస్తుందా.. లేదా? అన్నది చూడాలి. `రొమాంటిక్` చిత్నాన్ని పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి- ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా `ఫైటర్` అనే చిత్రానికి పూరి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. రౌడీ సరసన నాయికల్ని వెతుకుతున్నారు కాబట్టి ఈ రేంజులో వేడెక్కిస్తున్న కేతికకు అందులో ఆఫర్ ఉంటుందో ఏమో చూడాలి.
Please Read Disclaimer