హమ్మయ్యా ఆ రీమేక్ లేదంట!

0

ఎక్కడి నుంచి వస్తాయో కాని కొన్ని రూమర్లకు రెక్కలు వచ్చేసి చాలా దూరం వెళ్ళిపోతాయి. నిన్న ఓ మీడియా వర్గంలో తమిళ బ్లాక్ బస్టర్ విక్రం వేదా రీమేక్ గురించి గట్టి ప్రచారమే జరిగింది. నందమూరి బాలకృష్ణ డాక్టర్ రాజశేఖర్ కాంబోలో ఇది రూపొందనుందని త్వరలోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో అభిమానులు రకరకాల అంచనాలకు వెళ్ళిపోయారు. వీటికి ఇప్పుడు చెక్ పడిపోయింది.

ఒరిజినల్ వెర్షన్ నిర్మాతలు వై నాట్ స్టూడియోస్ స్వయంగా ప్రెస్ నోట్ ఇవ్వడంతో క్లారిటీ వచ్చేసింది. విక్రం వేదా తెలుగు రీమేక్ హక్కులు ఎవరికీ ఇవ్వలేదని అలాంటిది ఏదైనా ఉంటే తమ సంస్థ తరఫున ప్రకటన వస్తుందని చెప్పేశారు. సో బాలయ్య రాజశేఖర్ కాంబోలో మల్టీ స్టారర్ అనేది గాలి వార్తగా రూడీ అయ్యింది. నిజానికి ఇది రిలీఫ్ గా ఫీలవ్వాల్సిన వార్త.

తమిళ్ లో బాహుబలికి ధీటుగా వసూళ్లు తెచ్చి క్లాసిక్ స్టేటస్ తెచ్చుకున్న విక్రం వేదా ఇలా సీనియర్ హీరోలతో చేయాల్సిన రీమేక్ కాదు. అందులోనూ మాస్ కథానాయకులకు ఇది అసలు సూట్ కాదు. గతంలో వెంకటేష్ రానాలతో ఇది రీమేక్ చేయాలన్న ఆలోచన ఈ కారణంగానే మానుకున్నారు.

మాధవన్-విజయ్ సేతుపతిల టెర్రీఫిక్ పెర్ఫార్మన్స్ కి సూటయ్యే ఆర్టిస్టులను సెట్ చేసుకోవడం అంత సులభం కాదు. అందుకే కన్నడలో సైతం దీన్ని రీమేక్ చేసే సాహసం ఇప్పటిదాకా చేయలేకపోయారు. విక్రం వేదాను బాషతో సంబంధం లేకుండా ఓన్ చేసుకున్న సినిమా ప్రేమికులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు రిలాక్స్ అవ్వొచ్చు.
Please Read Disclaimer