పెళ్లి వాయిదా వేసే ఆలోచన లేదట

0

టాలీవుడ్ పై కరోనా ప్రభావం క్లీయర్ గా కనిపిస్తుంది. థియేటర్ల బంద్ తో సినిమాల విడుదల వాయిదా వేస్తున్నారు. ఇక షూటింగ్స్ కు కూడా బ్రేక్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సమయంలోనే ఇద్దరు యంగ్ హీరోల పెళ్లి విషయంలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. నితిన్ ఇంకా నిఖిల్ ల వివాహం వచ్చే నెలలో ప్లాన్ చేసుకున్నారు. నితిన్ దుబాయిలో పెళ్లి ఫిక్స్ చేసుకోగా.. నిఖిల్ హైదరాబాద్ లోనే ఒక కన్వెన్షన్ లో వివాహ ఏర్పాట్లు చేయిస్తున్నాడు. ఇలాంటి సమయంలో కరోనా ఆ యంగ్ హీరోల ఇద్దరి విషయంలో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొనేలా చేసింది.

నితిన్ పెళ్లి వాయిదా విషయమై కుటుంబ సభ్యులు ఆలోచిస్తూ ఉంటే నిఖిల్ మాత్రం పెళ్లిని వాయిదా వేసేది లేదు అంటూ గట్టిగా చెబుతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం మార్చి 31 తర్వాత పెళ్లిల విషయంలో ఆంక్షలు విధించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆంక్షలకు అనుగుణంగా నిఖిల్ తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతే తప్ప పెళ్లి తేదీ మార్చే యోచన మాత్రం లేదని నిఖిల్ సన్నిహితుల వద్ద అన్నట్లుగా సమాచారం.

అంగరంగ వైభంగా జరుపుకోవాలనుకున్న పెళ్లి ఇలా ఆంక్షల మద్య జరుపుకోవాల్సి రావడం బాధాకరం అంటూ నిఖిల్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వేడుకలు.. జర్నీలు అంటే చాలా మంది భయపడుతున్నారు. కనుక చాలా మంది పెళ్లిలు వాయిదా వేసుకుంటున్నారు. కాని నిఖిల్ మాత్రం ఇప్పటికే ఏర్పాట్లు జరిగి పోయాయి కనుక వాయిదా వేయకూడదని భావిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-