అంతా నిన్నే ఫాలో అవుతున్నారు.. రాహుల్ తో నోయల్

0

అనారోగ్య కారణంతో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన సింగర్.. యాక్టర్ నోయల్ మళ్లీ హౌస్ లోకి వెళ్లడం లేదు అంటూ మొన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ప్రకటించాడు. నోయల్ అనారోగ్య కారణాలతో ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లోంచి వెళ్లిన అందరు కూడా బిగ్ బాస్ బజ్ అంటూ గత సీజన్ విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ కు ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్తూ ఉంటారు.

నోయల్ ఎలిమినేషన్ తర్వాత రాహుల్ తో ముచ్చటించాడు. వీరిద్దరు మొదటి నుండి మంచి స్నేహితులు. గత సీజన్ సమయంలో రాహుల్ కు నోయల్ మంచి సపోర్ట్ అందించాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రాహుల్ కు మద్దతుగా ప్రచారం చేశాడు. ఈ సారి నోయల్ కు మద్దతుగా రాహుల్ ప్రచారం చేశాడు.

వీరిద్దరి మద్య ముచ్చట్లు ఎలా ఉంటాయా అంటూ ఆసక్తిగా ఎదురు చూశారు. అనుకున్నట్లుగానే ఇద్దరి మద్య సంభాషణలు సరదాగా సాగాయి. ముఖ్యంగా ఇంట్లోని రిలేషన్ షిప్ గురించి నోయల్ ఫన్నీగా మాట్లాడాడు. ఇంట్లో అంతా నిన్ను ఆదర్శంగా తీసుకుని గ్రూప్ లుగా విడిపోయారు. అలాగే నీలా ఒక ట్రాక్ ను నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశాడు.

ఇంట్లో చాలా రిలేషన్ షిప్ లు నడుస్తున్నాయి అంటూ నోయల్ వ్యాఖ్యలు చేయగా ఎవరు ఎవరు అంటూ నొక్కి మరీ ప్రశ్నించాడు. అప్పుడు నవ్వుతూ నోయల్ ఆ ప్రశ్నను దాటవేశాడు. ఆయన చెప్పకున్నా ఇంట్లో ఉన్న రిలేషన్స్ పులిహోర కార్యక్రమాలు మనకు అర్థం అవుతూనే ఉన్నాయి. అయితే ఈ పులిహోర ఎపిసోడ్ అన్ని సార్లు వర్కౌట్ అవ్వదు అనేది ఇప్పటిక అర్థం అయ్యింది వారికి.