హీరోయిన్ ను ఏడిపించిన ఫ్యాన్స్

0

సెలబ్రెటీలు పబ్లిక్ ఈవెంట్స్ లో ఇబ్బంది పడ్డ సందర్బాలు చాలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్ ఏదైనా ఓపెనింగ్ కు వెళ్లినప్పుడు లేదంటే ఏదైనా పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తరుచుగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. స్టార్ హీరోయిన్స్ నుండి చిన్న హీరోయిన్స్ వరకు ఏదో ఒక సమయంలో చాలా మందికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇటీవల మలయాళి ముద్దుగుమ్మ నూరిన్ షెరీఫ్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. దాంతో స్టేజ్ పైనే నూరిన్ కన్నీరు పెట్టుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మంజేరిలోని ఒక సూపర్ మార్కెట్ ఓపెనింగ్ కు నిర్వాహకులు నూరిన్ ను గెస్ట్ గా పిలిచారు. సాయంత్రం 4 గంటల సమయంలో సూపర్ మార్కెట్ ఓపెనింగ్ అంటూ చెప్పడంతో జనాలు మద్యాహ్నం మూడు గంటల నుండే అక్కడకు చేరుకోవడం జరిగింది. నూరిన్ కూడా హోటల్ కు మూడున్నర వరకు చేరిందట. అయితే సూపర్ మార్కెట్ యాజమాన్యం జనాలు ఇంకా ఎక్కువ రావాలనే ఉద్దేశ్యంతో కార్యక్రమంను 5 గంటలకు ఆ తర్వాత 6 గంటలకు వాయిదా వేశారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో నూరిన్ అక్కడకు చేరుకుంది.

సూపర్ మార్కెట్ వద్దకు నూరిన్ చేరుకున్న వెంటనే జనాలు ఆలస్యం అయ్యిందంటూ ఇంత సమయం వెయిట్ చేశామంటూ కారుపై గట్టిగా కొట్టడంతో పాటు ఆమెకు అడ్డు పడ్డారు. ఏదోలా కారును స్టేజ్ వరకు తీసుకు వెళ్లారు. కారులోంచి నూరిన్ దిగిన సమయంలో కూడా చాలా మంది అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. ఆసమయంలో ఆము ముక్కుకు ఒక వ్యక్తి చేయి బలంగా తలిగింది. దాంతో ఆమెకు చిన్న గాయం అయ్యిందని తెలుస్తోంది.

గాయం బాధతో స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న ఆమె రెండు నిమిషాలు కాస్త ఊపిరి పీల్చుకుని సూపర్ మార్కెట్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడింది. ఆలస్యంకు కారణం తాను కాదని.. తాను వచ్చి వెయిట్ చేస్తున్నాను అని యాజమాన్యం ఆలస్యం చేయడం వల్లే నేను లేట్ గా వచ్చానంటూ చెప్పుకొచ్చింది.

సోషల్ మీడియా సెన్షేషన్ ప్రియా వారియర్ మొదటి సినిమా ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది. మొదట నూరిన్ ను ఫస్ట్ హీరోయిన్ గా చిత్రీకరణ జరిపారు. అయితే ప్రియావారియర్ కు వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకునేందుకు నూరిన్ పాత్రను తగ్గించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. నూరిన్ ఆ తర్వాత కూడా ఒకటి రెండు మలయాళ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కూడా ఈమె ఒక మలయాళ చిత్రంలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Please Read Disclaimer