మేకప్ ఆర్టిస్టుతో కలిసి బీచ్ లో గంతులేసిన మనోహరి

0

బాహుబలి మనోహరి నోరా ఫతేహి గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ టు టాలీవుడ్ ఈ అమ్మడికి వీరాభిమానులే ఉన్నారు. బాహుబలిలో మనోహరి గీతానికి నోరా అందించిన నృత్యాల్ని యూత్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇక బాహుబలుడిపై ప్రశంసలు కురిపించేసిన నోరా అతడిపై మనసు పారేసుకున్నానని అనడంతో డార్లింగ్ అభిమానులకు కనెక్టయిపోయింది.

అదంతా పాత కథే కానీ.. ఈ అమ్మడు ఇటీవల యూరప్ ప్రయాణాలతోనే బిజీబిజీగా గడిపేస్తోంది. ఇటు ముంబైలో అడుగు పెట్టిన ప్రతిసారీ ఏదో ఈవెంట్ తో టచ్ లోకి వస్తోంది. పనిలో పనిగా లేటెస్ట్ ఫోటోషూట్లతో సామాజిక మాధ్యమాల్లో వేడెక్కించేస్తోంది. నోరా షేర్ చేసిన తాజా ఫోటో యూత్ లో హాట్ టాపిక్ గా మారింది.

అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డు చెప్పని నోరా.. మరోసారి తనదైన శైలి ఫోటోగ్రాఫ్ తో వేడి పెంచింది. సింపుల్ టాప్ లో కవ్వించే లుక్ తో కనిపిస్తోంది. ఇక అప్పుడే బీచ్ సెలబ్రేషన్ ముగించి నీలాల కురుల్ని ఎండకు ఆరబెట్టిన దేవతలా మెరిసిపోతోంది. ఇక అంతందానికి ఆ కురులలో తురిమిన ఆ పువ్వందం ఇంకా అదనపు ఆకర్షణ పెంచింది. చూపులతోనే కాకలు పుట్టిస్తోంది మనోహరి. నోరా తన మేకప్ ఆర్టిస్టు మార్కో పెడ్రోతో కలిసి బీచ్ లో డ్యాన్సులు ఆడిన వీడియో ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది.