‘బాహుబలి’ స్టార్ చాలా సార్లు మోసపోయిందట!

0

బాలీవుడ్ తో పాటు సౌత్ ఆడియన్స్ కు కూడా తన ఐటెం సాంగ్స్ తో పరిచయం అయిన నోరా ఫతేహీ కెనడా నుండి ఇక్కడకు దిగుమతి అయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ యాక్టరస్ గా ఉన్న నోరా కెరీర్ ఆరంభంలో చాలా కష్టాలను ఎదుర్కొందట. కెనడాలో మోడలింగ్ చేస్తూ ఉన్న ఈమెను ఒక ఇండియన్ ఏజెన్సీ నటన పేరుతో ఇండియాకు రప్పించి 20 లక్షల రూపాయలు వసూళ్లు చేసిందట. ఆ తర్వాత మోసం చేసిందట. కష్టపడి సంపాదించిన డబ్బు పోవడంతో ముంబయిలోని ఒక అపార్ట్ మెంట్ లో 8 మందితో రూం షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నా రూమెట్స్ పాస్ పోర్ట్ ను దొంగిలించారు.

ఇండియా వచ్చిన తర్వాత చాలా మంది చేతిలో మోసపోయాను. హిందీ నేర్చుకుని ఆడిషన్స్ కు వెళ్లిన నాకు ఎన్నో చోట్ల అవమానాలు ఎదురయ్యాయి. నేను మాట్లాడే హిందీకి అక్కడ నవ్వేవారు. ఇండియాలో విదేశీయులు జీవించడం చాలా కష్టం. ఇక్కడి పరిస్థితులు విదేశీయులకు అస్సలు అనుకూలం కాదు. ఎన్నో ఆడిషన్స్ కు హాజరు అయిన నాకు నటన నీ వల్ల కాదు.. వెనక్కు వెళ్లిపో అనే సమాధానం వచ్చింది. నేను నటన చేస్తుంటే సర్కస్ చూసినట్లుగా చూసి నవ్వేవారు.

ఆడిషన్స్ వెళ్లిన ప్రతి సారి కూడా నాకు అవమానం ఎదురైంది. అక్కడి నుండి వస్తూ వస్తూ మద్యలో బాగా ఏడ్చేదాన్ని. ఎన్నో అవమానాలు కష్టాలను ఎదుర్కొని ఇప్పుడు కాస్త నిలదొక్కుకున్నట్లుగా నోరా చెప్పుకొచ్చింది. తెలుగులో ఈమె బాహుబలి చిత్రంతో పాటు టెంపర్ మరియు లోఫర్ చిత్రాల్లో కూడా ఐటెం సాంగ్స్ చేసి అలరించింది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో బిజీగా ఉంది.
Please Read Disclaimer