నిర్మాతలను పీడిస్తున్న ఉత్తరాది భామలు!

0

ఏమన్నా అంటే నిష్టూరం అంటారు కానీ మన ఫిలిం మేకర్లకు పరాయి భాషల భామలంటే మహా ముద్దు. అదేమంటే సవాలక్ష కారణాలు చెప్తారు. ఇదే చాలామంది ముంబై భామలకు అలుసుగా కూడా మారిందని ఎప్పటి నుంచో టాక్ ఉంది. ఈమధ్య ఈ భామలు నిర్మాతలను ఓ విషయం లో సతాయిస్తున్న వ్యవహారం బయటకు వచ్చింది.

కోవిడ్-19 అని టెక్నికల్ గానూ కరోనా అని క్యాజువల్ గానూ పిలుచుకుంటున్న కొత్త జబ్బు దెబ్బకు టాలీవుడ్ లావాదేవీలు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. అటు థియేటర్లు మూత పడగా ఇటు షూటింగులకు కూడా కొంత కాలం గ్యాప్ ఇచ్చారు. పరిస్థితిని బట్టి ఈ కరోనా శెలవులను ఫిలిం ఛాంబర్ వారు మరింత పొడిగించే అవకాశం కూడా ఉంది. ఈ శెలవుల కారణంగా హీరోయిన్లకు షూటింగులు లేవు. హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉన్న ఒకరిద్దరు భామలను మినహాయిస్తే మిగతా భామలకు నిర్మాతలు పెద్ద స్టార్ హోటల్స్ లో వసతి కల్పిస్తారు. నెలల తరబడి బిల్స్ కూడా కడతారు. ఇప్పుడు షూటింగులు లేవు కాబట్టి ఖాళీ చేసి మీ కొంపలకు పోయి ఉండండమ్మా అంటే.. వారు మాత్రం ఫైవ్ స్టార్ హోటళ్ళ చుట్టూ పట్టుకుని వేలాడుతూ ఉన్నారట.

అసలే షూటింగులు ఆగినందువల్ల నిర్మాతలకు వడ్డీల రూపంలో నష్టం వాటిల్లుతోంది. ఈ సమయంలో ఈ అదనపు ఖర్చు అయినా తగ్గించుకుందామంటే ఈ బాలీవుడ్ భామలు వారి సొంత ఊర్లకు పోకుండా ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఉంటూ నిర్మాతలకు మరింత నష్టం కలిగిస్తున్నారట. ఇప్పుడు ఆ భామలను మరీ విసిగిస్తే రేపు షూటింగ్ సమయంలో ఇబ్బంది పెడతారేమోననే భయంతో నిర్మాతలు కూడా రూములు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని గట్టిగా చెప్పలేకుండా ఉన్నారట. ఇదే లోకల్ భామలైతే ఎంచక్కా ఇంటికి వెళ్ళిపోయి ఉండేవారు కదా అని నిట్టూరుస్తున్నారట!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-