సినిమా రేంజ్ లో లేదు.. అందరి కంప్లైంట్ ఇదే!

0

ఈ శుక్రవారం రిలీజైన సినిమాలో కొద్దోగొప్పో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ చిత్రం ద్వారా తరుణ్ భాస్కర్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా రిలీజ్ కు ముందు ప్రోమోస్ విడుదలైన సమయంలో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అన్నీ సెక్షన్ల ఆడియన్స్ ను మెప్పించే చిత్రం కాకపోయినా యూత్ కు కనెక్ట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అయింది.

సీన్ కట్ చేస్తే సినిమా రిలీజ్ అయింది.. రివ్యూస్ వచ్చాయి. మౌత్ టాక్ వచ్చేసింది.. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ కూడా వచ్చేశాయి. సినిమా పాయింట్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్న ఎక్కడో తేడా కొట్టిందనే విషయం అర్థం అవుతోంది. మరి ఎక్కడ పొరపాటు జరిగింది? ఈ సినిమా రివ్యూల్లోనూ.. సినిమా చూసిన ప్రేక్షకుల్లోనూ ఒక అభిప్రాయం కామన్ గా వినిపించింది. అదేంటంటే .. “మీకు మాత్రమే చెప్తా లో సినిమాకు సరిపోయేంత కథ లేదు.. రెండు గంటల సినిమాకు తగిన కాన్ ఫ్లిక్ట్ లేదు. పాయింట్ వినేందుకు బాగుంది..ఒక షార్ట్ ఫిలింగా అయితే బ్రిలియంట్ గా ఉండేది. అదే పాయింట్ ను సినిమాగా మలచడంతో స్ట్రెచ్ అయిన ఫీలింగ్ కలిగింది” ఇది మెజారిటీ ప్రేక్షకుల కంప్లైంట్.

ఇదొక్కటే కాదు.. ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ మరీ షార్ట్ ఫిలిం లాగా అనిపించడం కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. విజయ్ దేవరకొండ తండ్రిగారైన వర్ధన్ దేవరకొండ ఈ సినిమాకు ఐదు కోట్లు ఖర్చుపెట్టామని.. DI లో టెక్నికల్ ఇష్యూ వల్ల.. నైట్ సీన్స్ వల్ల అలా సినిమా డల్ గా కనిపించిందని కవర్ చేస్తున్నారు కానీ ఆ విషయం ఎవరూ నమ్మడం లేదని సోషల్ మీడియాలో కామెంట్లు చూస్తేనే అర్థం అవుతోంది. ఈ సినిమాను ఇప్పటికే చాలామంది ‘షార్ట్ ఫిలిం కు ఎక్కువ సినిమాకు తక్కువ’ అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఇది పనిగట్టుకుని విమర్శించడం కాదు కానీ నెటిజన్ల అభిప్రాయాలను విజయ్ తన నెక్స్ట్ సినిమాకు అయినా పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం.
Please Read Disclaimer