తూచ్.. కియారా కాదు మరో బాలీవుడ్ భామ!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ ను ఈమధ్యే ప్రకటించారు. టైటిల్.. ఫస్ట్ లుక్.. మహేష్ గెటప్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శుడు పరశురామ్ ఈసారి మహేష్ ను కొత్తగా చూపించబోతున్నాడని అందరికీ అర్థం అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి ఆసక్తికరమైన వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వాని పేరును పరిశీలిస్తున్నారని కియారా కూడా ఒకే చెప్పిందని అన్నారు. అయితే ఇప్పుడు ఆ వార్తలు తూచ్ అని.. మరో హీరోయిన్ పేరును పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కియరా గతంలో మహేష్ తో ‘భరత్ అనే నేను’ లో నటించిన సమయంలో పెద్దగా బిజీగా లేదు కాబట్టి డేట్స్ కేటాయించగలిగిందట కానీ ఇప్పుడు నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమధ్య రెండు నెలల నుంచి షూటింగులు అటూ ఇటూ కావడంతో కియారా కాల్ షీట్స్ దొరకడం కష్టంగా ఉందట. దీంతో పరశురామ్ టీమ్ మరో హీరోయిన్ సాయి మంజ్రేకర్ పేరును పరిశీలిస్తున్నారట.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు- నటుడు అయిన మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్ ‘దబాంగ్-3’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి అవకాశమే సల్మాన్ సరసన రావడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి సినిమాతో అటు నటన పరంగా ఇటు లుక్స్ పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. సాయి మంజ్రేకర్ అయితే మహేష్ కు జోడీ కొత్తగా ఉంటుందని.. కాల్ షీట్స్ విషయంలో కూడా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో నిర్మాతలు ఉన్నారని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది..
Please Read Disclaimer