చిరునే కాదు చెర్రీ కూడా ఫ్రెండే

0

క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పార్టీలో సౌతిండియా టాప్ 40 స్టార్ల సందడి గురించి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కొత్త ఇంట్లో ఈ వేడుక అంగరంగ వైభవంగా సాగింది. మొన్న ఆదివారం ఝాము రేతిరి కునుకు అన్నదే లేకుండా ఆ నలభై మంది స్టార్లు రీయూనియన్ పార్టీలో ఫుల్ చిలౌట్ చేశారు. పదో వార్షికోత్సవ వేడుకను ఎప్పటికీ మర్చిపోనంత గ్రాండ్ గా హోస్ట్ చేశారట మెగాస్టార్. ఇక ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన సందడి మామూలుగా లేదు.

చిరుతనయుడు ఎయిటీస్ లో ఫేవరెట్ స్టార్లందరితో చాలా సరదాగా టైమ్ ని స్పెండ్ చేశాడు. ఓవైపు ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ ఉన్నా.. ఆ రాత్రి అంతా చరణ్ ఫుల్ టైమ్ వీళ్లతో స్పెండ్ చేశాడు. అందరికీ గ్రీట్ చేసి ముచ్చట్లతో కాలక్షేపం చేసి సెల్ఫీలు .. ఫోటోలకు ఫోజులిస్తూ ఎంతో జాయ్ ఫుల్ గా గడిపేశాడు. ఇక చెర్రీతో కలిసిపోయిన ఎయిటీస్ స్టార్స్ అంతా ఫోటోలకు ఫోజులివ్వడం అవి కాస్తా వైరల్ అవ్వడం తెలిసిందే. ఇంతకుముందు ఖుష్బూతో కలిసి చరణ్ దిగిన ఫోటో అంతర్జాలంలో వైరల్ అయ్యింది. తాజాగా మరో కొత్త ఫోటో రివీలైంది.

ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫోటో కోసం ఫోజులిస్తూ.. చరణ్ భుజాలపై చేతులు వేసి ఎంతో ఆప్యాయంగా కనిపించారు. ఇంతకుముందు సేమ్ టు సేమ్ మెగాస్టార్ ని మోహన్ లాల్ ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని స్నేహంగా కనిపించిన ఫోటో ఇంతే అబ్బుర పరిచింది. చిరుతోనే కాదు.. చరణ్ తోనూ లాల్ ఎంత సన్నిహితంగా ఉంటారో ఈ ఫోటోలే ప్రత్యక్ష సాక్ష్యం. ఇక ఇదే ఫ్రేమ్ లో మరో సీనియర్ నటుడు ప్రభు ఉన్నారు. వీళ్లతో పాటు సీనియర్ స్టార్లు సుమలత-నదియా-రాధ- జయప్రద తదితరులు ఫ్రేమ్ లో సందడిగా కనిపించారు.
Please Read Disclaimer