ప్రియురాలిని పెళ్లాడిన `నోటా` డైరెక్టర్

0

2018 దీపావళికి ప్రపోజ్ చేశాడు. 2019 వినాయక చవితికి ముందే పెళ్లాడేశాడు. ఎవరు ఈ డైరెక్టర్ అంటే.. నోటా ఫేం ఆనంద్ శంకర్ గురించే. రౌడీ దేవరకొండ చియాన్ విక్రమ్ అంతటి వాడు! అంటూ పొగిడేసిన ఈ యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఎట్టకేలకు తన ప్రియురాలు దివ్యాంక జీవానందమ్ ని పెళ్లాడేశాడు. ఇది పెద్దలు కుదుర్చిన ప్రేమవివాహం.

తాజాగా ఈ వివాహానికి సంబంధించి ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో రివీలైంది. ఈ ఫోటోలో ఆనంద్ ఎంతో ఉల్లాసంగా పెళ్లి మూడ్ లో కనిపిస్తున్నారు. ఆనంద్ ఫ్లాష్ బ్యాక్ పరిశీలిస్తే.. అతడు జాతీయ అవార్డ్ గ్రహీత .. ట్యాలెంటెడ్ ఏ.ఆర్.మురుగదాస్ శిష్యుడు. విక్రమ్ ప్రభు- ప్రియా ఆనంద్ జంటగా `అరిమా నంబి` అనే యాక్షన్ థ్రిల్లర్ తో కెరీర్ ప్రారంభించాడు. కళైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలి ప్రయత్నం విజయం అందుకుని అటుపై చియాన్ విక్రమ్ – నయనతార జంటగా ఇరుముగన్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ప్రయత్నం సక్సెస్. ఆ క్రమంలోనే కొంత గ్యాప్ తర్వాత రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన తెలుగు – తమిళ్ ద్విభాషా చిత్రం `నోటా` పరాజయం పాలైంది.

ఆనంద్ గత ఏడాది దుబాయ్ కి దీపావళి సెలబ్రేషన్స్ కోసం వెళ్లినప్పుడు తన ప్రియురాలు దివ్యాంకకు ప్రపోజ్ చేశారు. ఆ సంగతిని అభిమానులకు వెల్లడించారు. “నా ప్రయివేటు జీవితంపై తొలి పోస్టింగ్ ఇదే. కొంత సిగ్గుగా ఉంది. అయితే ఈ ఆనందాన్ని షేర్ చేసుకోవాలనిపించింది. నా లవ్ కి మీ ఆశీస్సులు కావాలి. హ్యాపి దీపావళి! అంటూ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ప్రేమలో పడిన ఏడాదిలోగానే కుర్రాడు ఓ ఇంటివాడయ్యాడు. అదీ సంగతి.
Please Read Disclaimer