జాతరలో మసాలా తగ్గినట్టుందే

0

ఎంత మంచి వాడవురా.. కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రమిది. సంక్రాంతి పందెంలో నువ్వా నేనా అంటూ తలపడుతున్న అగ్ర హీరోలతో పోటీకి వెళుతున్నాడు. అయితే కాస్త సంక్రాంతి ముగింపు రోజు చూసుకుని రిలీజ్ ప్లాన్ చేయడం కొంత రిలీఫ్ అనే చెప్పాలి.

పోటీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే చిత్రబృందం ప్రచారంలో వేగం పెంచింది. ఇంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్లు.. ప్రచార చిత్రాలకు చక్కని స్పందన వచ్చింది. తాజాగా జాతరో జాతర అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. పల్లెల్లో పచ్చని వాతావరణం నడుమ ఈ పాటను చిత్రీకరించారు. జాతర కోసం అవసరం మేర సెటప్ చేసిన విషయం ఆ లొకేషన్ చూస్తే తెలిసిపోతోంది. బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్ సింగింగ్ ప్లస్ కాగా.. గోపి సుందర్ మ్యూజిక్ ఫర్వాలేదనిపిస్తుంది.

అయితే జాతర పాట అంటే మాస్ ఆడియెన్ మరి కాస్త అదనంగా మాస్ మసాలా కావాలని కోరుకుంటారు. వీధి వీధి అంతా కిక్కిరిసిన జనాల మధ్య జాతర సందడిని చూడాలనుకుంటారు. కానీ ఆ సెటప్ జస్ట్ ఓకే. అందాల ఐటెమ్ గాళ్ టెంప్టింగ్ మూవ్ మెంట్స్ ఇచ్చేందుకు ఆస్కారం ఉన్నా.. ఎందుకనో కాస్త చప్పగానే తేల్చేశారని ఆ డ్యాన్సింగ్ మూవ్స్ చెబుతున్నాయి. ఒక రెగ్యులర్ పంథాలోనే కొరియోగ్రాఫ్ చేయడం అంత ఎగ్జయిట్ మెంట్ పెంచలేదు మరి. గోపి సుందర్ ట్యూన్ రొటీనే. ఈ రోజుల్లో ఏం చేసినా కొత్తదనం లేనిదే జనం నిరాశపడుతున్నారు. మరి ఈ జాతర పాట థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన ఎఫ్ 2 బ్యూటీ మెహరీన్ కథానాయిక. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇండియా నిర్మిస్తున్న చిత్రమిది. ఉమేష్ గుప్త- సుభాష్ గుప్త నిర్మాతలు. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ బ్యానర్ కి తొలి ప్రయత్నం కావడంత ప్రతిష్ఠాత్మకంగా నే నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేయనున్నారు. తణుకు- రాజమండ్రి- హైదరాబాద్- చిక్ మంగుళూరు తదితర చోట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Please Read Disclaimer