నవంబర్ 7 అల వైకుంఠపురంలో టీజర్?

0

ప్రచారంలో ఎవరి ఎత్తుగడ వాళ్లకు ఉంటుంది. ఈసారి 2020 సంక్రాంతి బరిలో ఠఫ్ పందెం ఖాయమైంది. అయితే ఈ పందెంలో గెలవాలంటే ఎవరికి వారు ప్రచారం పరంగా కొత్త ఎత్తుగడలతో దూసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయంలో సరిలేరు నీకెవ్వరు టీమ్ కానీ అల వైకుంఠపురములో టీమ్ కానీ ఎవరికి వారు తగ్గడం లేదు. ష్యూర్ షాట్ గా పై చేయి సాధించాలనే ఉద్ధేశంతో ఒకరితో ఒకరు పోటీకి దిగుతున్నారు. మహేష్ – బన్ని సినిమాలు ఒకే రోజు రిలీజవుతుండడంతో అభిమానుల మధ్యా హోరా హోరీ పెరిగింది.

ఇక ఈ ఇద్దరూ ప్రమోషనల్ స్ట్రాటజీ పరంగా ఎలా ఆలోచిస్తున్నారు? అంటే.. బన్ని కాస్తంత ముందుగానే ప్రచారం ప్రారంభించాలని యోచిస్తుండగా.. మహేష్ మాత్రం డిసెంబర్ నుంచే తాపీగా ప్రచారం చేయాలని భావిస్తున్నారట. అల వైకుంఠపురములో టీమ్ ఇప్పటికే ఒక పాటను.. టీజర్ ని రిలీజ్ చేసి వేడి పెంచారు. అలాగే నవంబర్ 7న మాటల మాయావి త్రివిక్రమ్ బర్త్ డేని పురస్కరించుకుని పూర్తి టీజర్ ని రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. అంతకుముందే మరో పాటను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది చిత్రబృందం.

అయితే సరిలేరు టీమ్ ఆలోచన వేరొక విధంగా ఉంది. వరుసగా మహేష్.. విజయశాంతి .. రష్మిక పోస్టర్లను రిలీజ్ చేయడం ద్వారా.. అసలు ప్రచారాన్ని హోల్డ్ లో పెట్టాలన్నది ప్లాన్. డిసెంబర్ నుంచే టీజర్ కానీ పాటలు కానీ రిలీజవుతాయట. త్వరలోనే విజయశాంతి లుక్ లాంచ్ ఉంటుందని ఇప్పటికే రివీలైంది. ఈ ఇద్దరూ ఇలా దూసుకుపోతుంటే రజనీకాంత్ దర్బార్ టీమ్ అంతే దూకుడు ప్రదర్శించే యోచనలో ఉందిట.