ఫస్ట్ లుక్: 6 ప్యాక్ రాముడికి విల్లు విరిచే సవాల్

0

శ్రీరాముడు శివధనుస్సును విరిచాడు. దానికి కారణం ఉంది. సీత తనను వరించేందుకు ఆ ఫీట్ వేయాల్సి వచ్చింది. ఈ 6 ప్యాక్ రాముడు విల్లంబులు అందుకున్నాడు.. కానీ ఎందుకు? అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటారా?

ఏమో.. గత కొంతకాలంగా యంగ్ హీరో నాగశౌర్య సవాల్ చూస్తుంటే సృష్టికే ప్రతి సృష్టి చేసే ప్రయత్నమే చేస్తున్నాడనిపిస్తోంది. అది ఒక క్రీడాకారుడిగానా లేక ప్రేమికుడిగానా? అన్నది తెలియాలంటే కాస్త ఆగాలి. ఇంతకుముందు అశ్వద్థామ లాంటి సీరియస్ యాక్షన్ సినిమా చేశాడు శౌర్య. మగువల జీవితాలతో ఆడుకుంటే సహించని అశ్వథ్థామగా ఛాలెంజ్ చేశాడు. రిజల్ట్ మాట ఎలా ఉన్నా చేసిన ప్రయత్నాన్ని కొందరు ప్రశంసించారు.

తాజాగా మరో వినూత్న ప్రయత్నమే చేస్తున్నాడు. ఈసారి విజయమే ధ్యేయంగా అతడి ప్రయత్నం కనిపిస్తోంది. అంతేకాదు.. తాజా మూవీ కోసం అతడు శారీరకంగా కఠోరంగా శ్రమించాడని అర్థమవుతోంది. మొన్నటికి మొన్న చొక్కా లేకుండా బ్యాక్ లెస్ ఫోజులో కనిపించి చెమటలు పట్టించాడు. ఆ ప్రీలుక్ చూడగానే జనం ఫిక్సయిపోయారు. శౌర్య ఈసారి కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు. పైగా అతడి రూపం భీకరంగా కనిపించే సరికి భారీ యాక్షన్ థ్రిల్లర్ తోనే వస్తున్నాడని అర్థమైంది.

జనకుని కుమార్తె సీతను వివాహమాడాలంటే శివధనుస్సును ఎక్కుపెట్టాలి. గురువుల అనుజ్ఞతో శివధనుస్సు విరిచి పెద్దల ఆశీర్వాదంతో సీతను పరిణయమాడాడు శ్రీరాముడు. ఇప్పుడు శౌర్య కూడా అలా చేయబోతున్నాడా? 6 ప్యాక్ తో చొక్కా విప్పి మగువల గుండెల్ని దోచేస్తున్నాడు. ఈ రూపం కోసం అతడు ఎంతగా శ్రమించాడో అర్థం చేసుకోవచ్చు. భీకరంగా మునీశ్వరుడిలా మీసాలు గడ్డాలు పెంచి విల్లు విరిచేస్తే సక్సెస్ దక్కదని శౌర్యకి బాగా తెలుసు. లూయీస్ ఫిలప్ అండర్ వేర్ పై డెనిమ్స్ తొడిగినా సక్సెస్ దక్కడం ఈజీ కాదని తెలుసు. అందుకే ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు. గెలుపే ధ్యేయంగా విల్లు ఎక్కిపెట్టినట్టే కనిపిస్తోంది. అతడి ప్రయత్నం సక్సెసవుతుందనే ఆశిద్దాం. ఈ కొత్త లుక్ మాత్రం ఫెంటాస్టిక్ గా ఉంది. ఈ గెటప్ అతడికి సూటైంది.

ఒక క్రీడాకారుడి జీవితకథతో ఈ సినిమా తీస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అందులో నిజం ఎంతో చిత్రబృందం చెప్పాల్సి ఉంటుంది. నారంగ్ దాస్ కె నారంగ్ – పి.రామ్ మోహన్ – శరత్ మరర్ సంయుక్త నిర్మాణ సంస్థలో ఈ మూవీ తెరకెక్కుతోంది. నాగ శౌర్య సరసన కేతికా శర్మ కథానాయికగా నటిస్తోంది. కేతిక ఇప్పటికే ఆకాశ్ పూరి సరసన రొమాంటిక్ మూవీలో నటిస్తున్న సంగతి విధితమే.Please Read Disclaimer