ఎన్టీఆర్30 : ఆ రెండు వార్తలపై స్పష్టత

0

ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడమే ఆలస్యం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. మాటల మాంత్రికుడు అల వైకుంఠపురంలో వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ చిత్రంకు అయిననూ పోయి రావలే హస్తినకు అనే వైవిధ్యభరిత టైటిల్ ను అనుకున్నాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ ను దక్కించుకోవడం ఖాయం. కనుక ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీలా చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అందుకే అయిననూ పోయి రావలే హస్తినకు అనే టైటిల్ కాకుండా అన్ని భాషల ప్రేక్షకులకు అర్థం అయ్యేలా ఒకే టైటిల్ ను ఖరారు చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. ఇక రెండవ వార్త ఈ సినిమాలో కీలక పాత్రకు గాను సంజయ్ దత్ ను ఎంపిక చేశారని రాజకీయ నాయకుడిగా సంజయ్ దత్ కనిపించబోతున్నాడు అంటూ ప్రముఖంగా మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఎన్టీఆర్ 30 లో సంజయ్ దత్ పాత్రపై ప్రొడక్షన్ టీమ్ అనధికారికంగా క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు సంజయ్ దత్ తో కనీసం చర్చలు కూడా జరపలేదన్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. షూటింగ్ కు ఎలాగూ కాస్త ఆలస్యం అయ్యేట్లుగా ఉంది కనుక హడావుడి లేకుండా స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసి సినిమాను మొదలు పెట్టే సమయంకు నటీనటులను ఎంపిక చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారట. హీరోయిన్ విషయంలో కూడా ప్రచారం అయితే జరుగుతుంది కాని అధికారికంగా అయితే క్లారిటీ ఇవ్వలేదు.Please Read Disclaimer