అలాంటిదే కోరిన యంగ్ టైగర్.. సరే అన్న గురూజీ!

0

‘అజ్ఞాతవాసి’ సినిమాతో త్రివిక్రమ్ హవాకు బ్రేక్ పడినట్టేననే కామెంట్లు వినిపించాయి. అయితే వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ సినిమా తో ఫర్వాలేదు అనిపించుకున్నారు త్రివిక్రమ్. ఇక ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ‘అల వైకుంఠపురములో’ సినిమా తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కెరీర్ బెస్ట్ హిట్ అందించి మరోసారి హాట్ షాట్ డైరెక్టర్ గా మారిపోయారు.

త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఎన్టీఆర్30 సినిమా కోసం రెడీ అవుతున్నారు. ‘అరవింద సమేత’ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా కావడంతో ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించాలని ఉందని ‘అల వైకుంఠపురములో తరహాలో పూర్తిస్థాయి కామెడీ ఉండాలని ఎన్టీఆర్ కోరడంతో ప్రస్తుతం గురూజీ అలాంటి స్క్రిప్ట్ వండుతున్నారట. ‘RRR’ తర్వాత ఒక లైట్ వెయిన్ లో సాగే సినిమా అయితే ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంటుందని.. త్రివిక్రమ్ కూడా అలాంటి సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు కావడంతో అలాంటి సినిమానే చేద్దామని ఎన్టీఆర్ కోరారట.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తారని సమాచారం. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న PSPK30 ప్రకటన త్వరలోనే రానుందట. మధ్యలో కొంత డౌన్ అయినట్టు కనిపించినప్పటికీ త్రివిక్రమ్ ఇప్పటికే టాప్ లీగ్ స్టార్స్ తోనే సినిమాలు చేస్తూ ఉండడం విశేషం.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-