మంచివాడికోసం ఎన్టీఆర్ రాక ఖరారు

0

నందమూరి కళ్యామ్ రామ్ కొత్త సినిమా ‘ఎంత మంచివాడవురా’ ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటి వరకూ పెద్దగా హైప్ నెలకొనలేదు. అయితే ఈ సినిమాపై బజ్ పెంచేందుకు నిర్మాతలు పెద్ద అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అతిథిగా తీసుకొస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ను తీసుకొస్తారనే వార్తలు వినిపించాయి. తాజాగా ‘ఎంత మంచివాడవురా’ టీమ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ విషయం తెలుపుతూ ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 8 వ తేదీన హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ హాల్ లో సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరవుతున్నారని కూడా వెల్లడించారు. ఈ పోస్టర్ లో ఎడమ వైపు ఎన్టీఆర్ ఫోటో.. కుడివైపు కళ్యాణ్ రామ్ ఫోటో ఉంది. యంగ్ టైగర్ రాకతో ఈ సినిమాపై బజ్ పెరగడం ఖాయమే.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా మెహ్రీన్ నటిస్తోంది. గోపి సుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సినిమాల్లో చివరిగా ఈ సినిమా జనవరి 15 న రిలీజ్ కానుంది. భారీ పోటీ మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కు మంచి హిట్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.
Please Read Disclaimer