సరిలేరు పై స్పందించని ఎన్టీఆర్..!

0

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సంక్రాంతి స్టార్ల సినిమాలు రిలీజ్ అయ్యాయి. కళ్యాణ్ రామ్ సినిమా ఇంకా రిలీజ్ కావలిసి ఉంది. రిలీజ్ అయిన సినిమాల్లో ‘దర్బార్’ ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ యావరేజ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ విషయంలో మోత మోగిస్తోంది. ఇక నిన్న రిలీజ్ అయిన అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. కలెక్షన్ల పరంగా అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ ఫిలిం కావచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ సినిమా గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందన ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఎన్టీఆర్ ‘అల వైకుంఠపురములో’ సినిమా గురించి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ బన్నీ నటనను ప్రశంసించాడు.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటింగ్ ను బ్రిలియంట్ అంటూ ఆకాశానికెత్తాడు. బన్నీని బావా అని.. త్రివిక్రమ్ ను స్వామీ అని సంభోదిస్తూ అభినందనలు తెలిపాడు. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ అనుబంధం గురించి ‘అరవింద సమేత’ ప్రమోషన్స్ సమయంలో అందరికీ తెలిసింది. మరో వైపు బన్నీతో కూడా ఎన్టీఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎన్టీఆర్ తన నెక్స్ట్ ఫిలిం త్రివిక్రమ్ తో చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ‘అల వైకుంఠపురములో’ సినిమా పట్ల ఇలా స్పందించి ఉంటారని కొందరు సరిపెట్టుకున్నారు. అయితే సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు మాత్రం ఇందులో తప్పులు వెతుకుతున్నారు.

అల్లు అర్జున్ సినిమా కంటే ముందే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా రిలీజ్ అయింది కానీ ఎన్టీఆర్ ఆ సినిమా గురించి స్పందించలేదు. సరిగ్గా ఇదే విషయం చాలామంది మహేష్ అభిమానులకు మింగుడు పడడం లేదు. మహేష్ గతంలో కొన్ని సందర్భాలలో ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే స్పందించాడు. గతంలో మహేష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యాడు. మరి ఇలాంటి అనుబంధం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా గురించి స్పందించకపోవడం సరికాదని అంటున్నారు. కొందరేమో ఇంకా ముందుకు పోయి మహేష్ కు ఎన్టీఆర్ కు గ్యాప్ వచ్చిందని కూడా కథలు అల్లేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం అలాంటిదేమీ లేదని.. మహేష్ సినిమా ఇంకా చూసి ఉండక పోవచ్చని అంటున్నారు. ఒకవేళ చూస్తే ఎన్టీఆర్ తప్పనిసరిగా స్పందిస్తారని అంటున్నారు. సంక్రాంతి పండుగ అయ్యేలోపు ఎన్టీఆర్ నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ పై ట్వీట్ వస్తుందేమో వేచి చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-