ఆ ఇద్దరికీ తారక్ అదిరిపోయే పార్టీ

0

జూ.ఎన్టీఆర్ స్నేహస్వభావం.. సహృదయత గురించి తెలిసిందే. అతిధి దేవోభవ అన్నందుకు ఆతిధ్యంలోనూ తనని కొట్టేవాళ్లే లేరు. తాజాగా ఆయన ఓ ఇద్దరు స్టార్లకు సర్ ప్రైజ్ ట్రీట్ ఇవ్వడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. ఇంతకీ ఆ లక్కీ స్టార్స్ ఎవరు..? అంటే..

బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్.. కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. ఆ ఇద్దరినీ వ్యక్తిగతంగా ఇంటికి పిలిచి స్పెషల్ డిన్నర్ పార్టీ ఎరేంజ్ చేశాడు. ఈ పార్టీలో ఇంతకుముందెన్నడూ చూడని స్పెషల్ ఐటెమ్స్ ని రెడీ చేశారట. ఈ ఆతిధ్యానికి ఆ ఇద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారని తెలుస్తోంది. ఆ ఇద్దరూ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో కేజీఎఫ్ 2 షూటింగులో బిజీగా ఉన్నారు. తారక్ పిలవగానే ఇంటికి వచ్చారట. ఇక యంగ్ హీరో యశ్ మాత్రం తారక్ ని ఎప్పుడెప్పుడు కలవాలా అనుకున్నాడట. మొత్తానికి నేరుగా ఇంటి వద్దనే తనని కలిసే అవకాశం దొరికింది. ఆ ముగ్గురూ డిన్నర్ పార్టీలో స్పెషల్ వంటకాల్ని ఆరగించి చాలా సమయం వెచ్చించి సినిమాల గురించి చాలా చాలా కబుర్లు ఆడుకున్నారట.

తారక్ మమ్మల్ని ట్రీట్ చేసిన విధానం చాలా సంతోషంగా అనిపించిందని.. ముంబై వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాల్సిందేనంటూ దత్ జీ కోరారట. దానికి తప్పకుండా అంటూ తారక్ జవాబిచ్చారని తెలుస్తోంది. యశ్ ఈ పార్టీతో ఫుల్ ఖుషీ అయిపోయాడట. మొత్తానికి అటు బాలీవుడ్ ఇటు శాండల్వుడ్ లో మంచి స్నేహితుల్ని సంపాదించుకున్నాడు తారక్. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఇలా తన స్నేహితుల్ని పెంచుకుంటూ యూనివర్శల్ స్టార్ గా ఎదిగేస్తున్నాడు.
Please Read Disclaimer