ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయిన ఎన్టీఆర్

0

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రణాళికలు యూనిక్ స్టైల్లో ఉంటాయన్న సంగతి తెలిసిందే. తనతో పని చేసే స్టార్ హీరోలు కొన్ని కట్టుబాట్లు నిబంధనలకు లోబడి పని చేయాల్సి ఉంటుంది. పైగా పాన్ ఇండియా కేటగిరీ సినిమాలో నటిస్తే ఆ నిబంధనలు మరీ ఎక్కువగానే ఉంటాయి. అలాంటి ఒప్పందాల్లోనే చరణ్ – తారక్ ఇరుక్కున్న సంగతి తెలిసిందే.

తన మూవీలో నటిస్తున్నంత కాలం ఆ ఇద్దరూ తమ గెటప్పులను అనధికారికంగా బహిర్గతం చేయకూడదన్న కఠిన నిబంధన అమల్లో ఉంది. కానీ పలు సందర్భాల్లో చరణ్ అల్లూరి గెటప్ .. తారక్ కొమరం భీమ్ గెటప్ కి సంబంధించిన లీకులు కలవరపెట్టాయి. ప్రయాణాల్లో విమానాశ్రయాల్లో క్యాప్ లు పెట్టుకుని కవర్ చేసేందుకు ట్రై చేసినా కానీ అభిమానులు ఫోటోల్ని లీక్ చేశారు. అలా వారి గెటప్పులు రివీలైపోయాయి. తారక్ వైజాగ్ షూట్ కి వెళ్లినప్పుడు గిరజాల జుత్తును క్యాప్ తో కవర్ చేయాలని చూసినా కానీ అది అందరికీ ఓపెనైపోయింది. ఆ తర్వాత రాజమౌళి చాలా కలతకు గురయ్యారు.

ఎంత దాచేద్దామన్నా దాగని వ్యవహారమిది. అప్పట్లో ఏపుగా పెరిగిన మెరిసే మీసంతో ఆపిల్ జ్యూస్ డ్రింక్ ప్రచారకర్తగా కనిపించాడు. తలకట్టు బయటపడకుండా టోపీ పెట్టి దాచడానికి తగినంత జాగ్రత్త తీసుకున్నా ఫ్యాన్స్ ఊహాగానాలకు మాత్రం రెక్కలొచ్చాయి. ఇప్పుడు కూడా మరోసారి వాణిజ్య ప్రకటనల్లో నటించాలంటే సేమ్ ఫార్ములాని అనుసరించాల్సిన పరిస్థితి. అంతా అనుకున్నట్టే అయితే ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ ఈ పాటికే పూర్తయ్యేది. కానీ ప్లాన్ అంతా తిరకాసు అయ్యింది. వైరస్ మహమ్మారీ దెబ్బకు బ్యాలెన్స్ షూటింగ్ కి వెళ్లాల్సి ఉందింకా. ఆ క్రమంలోనే తారక్ ప్రస్తుతం లైనప్ లో ఉన్న వాణిజ్య ప్రకటనల్ని పూర్తి చేయాల్సిన టైమ్ వచ్చేసిందట. రాజమౌళి సెట్స్ కి రమ్మని పిలిచే లోపే ఎన్టీఆర్ యాడ్ ఫిల్మ్స్ పూర్తి చేయాల్సి ఉందని తెలుస్తోంది.
Please Read Disclaimer