పవన్ రికార్డ్ ని అందుకోలేక పోయిన ఎన్టీఆర్

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన డిజాస్టర్ చిత్రం అజ్ఞాతవాసి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదలైన విషయం తెలిసిందే . అయితే పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో కేవలం ప్రీమియర్ షోలతోనే నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి నెంబర్ వన్ గా నిలిచింది . ఏకంగా ప్రీమియర్ షోలతోనే 1. 5 మిలియన్ డాలర్ల ని కొట్టేసింది అజ్ఞాతవాసి , అయితే ఆ తర్వాత డిజాస్టర్ అయ్యిందనుకోండి . ఇక ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్ర విషయానికి వస్తే ……. ఈ సినిమా ప్రీమియర్ షోలతో ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ అందుకున్నాడు కానీ పవన్ కళ్యాణ్ డిజాస్టర్ సినిమా అయిన అజ్ఞాతవాసి రికార్డ్ ని టచ్ చేయలేకపోయాడు .

అరవింద సమేత ప్రీమియర్ షోలతో అమెరికాలో 8 లక్షల డాలర్లకు పైగా వసూల్ చేసాడు ఎన్టీఆర్ . చాలారోజుల తర్వాత అగ్ర హీరో నటించిన సినిమా అందునా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమా కాబట్టి సందేశాత్మక చిత్రం కాబట్టి తప్పకుండా మంచి వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కూడా అజ్ఞాతవాసి నిర్మించిన చినబాబు అలియాస్ రాధాకృష్ణ నిర్మించడం విశేషం . అరవింద సమేత వీర రాఘవ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన మిగతా చిత్రాలకు భిన్నంగా ఉన్నందున తప్పకుండా ప్రేక్షకులను , ఎన్టీఆర్ అభిమానులను విశేషంగా అలరించడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం .
Please Read Disclaimer