ఎన్టీఆర్ ని మర్చి పోతే ఎలా.. ఫ్యాన్స్ ఫైరింగ్

0

సహజం గానే వేదికల పై మాట్లాడేప్పుడు పబ్లిక్ అటెన్షన్ ఉంటుంది కాబట్టి… అందుకు తగ్గట్టు సెలబ్రిటీలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అదుపు తప్పి మాట్లాడినా.. ప్రముఖుల పేర్లు ప్రస్థావిస్తూ ముఖ్యుల్ని మర్చిపోయినా వెంటనే అభిమానుల నుంచి రెస్పాన్స్ అంతే స్పీడ్ గా ఉంటుంది. పాపం నివేథ…. తెలిసో తెలియకో నిన్నటి(శుక్ర) సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన దర్బార్ ఈవెంట్లో అందరు స్టార్ హీరోల్ని ప్రస్థావించి తారక్ పేరును మర్చిపోయింది. ప్రతిగా సోషల్ మీడియా ఎటాక్ షురూ అయిపోయింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ దక్కినందుకు ఆనందం వ్యక్తం చేస్తూనే టాలీవుడ్ స్టార్ హీరోల పేర్లు వరుసగా ప్రస్థావించిన నివేథ అందులో తారక్ పేరును హైడ్ చేసింది. మహేష్- అల్లు అర్జున్- పవన్- చిరు – నాని అంటూ అందరినీ గుర్తు చేసుకుని ఆ ఒక్కడినే ఎందుకు మర్చిపోయింది? పైగా జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించింది కదా! అయినా ఎందుకు తెలిసీ ఈ మిస్టేక్ చేసింది? అంటూ సామాజిక మాధ్యమాల్లో తారక్ ఫ్యాన్స్ గరమగరమ కామెంట్లతో విరుచుకు పడ్డారు.

ఏదో తెలిసో తెలియకో.. ఫ్లోలో అలా మాట్లాడేసింది అని అనుకోవడానికే లేదు. అవకాశం దొరికితే చాలు ఫ్యాన్స్ చెలరేగుతారు. అలా మర్చిపోయి అడ్డంగా బుక్కయింది. కనీసం ఈసారైనా వేదికలపై జాగ్రత్త పడుతుందేమో చూడాలి. పూర్తిగా తన హీరోల పేర్లు చెప్పదలిస్తే ఎవరినీ విస్మరించకుండా జాగ్రత్త పడుతుందేమో. ఇక ఈ మల్లూ బ్యూటీ స్టడీస్ ని పూర్తి చేసి పూర్తిగా టాలీవుడ్ పై గురి పెట్టింది. వరుసగా అవకాశాలొస్తున్నాయి. ఈ టైమ్ లో నిత్యాలా కాస్త బిరుసుగా వెళ్లకుండా.. కెరీర్ ని మలుచుకుంటుందేమో చూడాలి. నివేథ నటిస్తున్న `వీ` చిత్రం త్వరలో రిలీజ్ కి రానుంది. అలాగే శ్వాస అనే చిత్రంలోనూ నటిస్తోంది.
Please Read Disclaimer