ఇష్టం లేకుండానే ఎన్ టిఆర్ సినిమా చేశాడట!

0

స్టైలిష్ దర్శకుడిగా.. ఎంటర్ టైన్ మెంట్ చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు మంచి టాక్ రావడంతో ఆయన తదుపరి చిత్రంపై చాలా ఆసక్తి నెలకొంది. ఈ సమయంలోనే ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.

సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నేను అతనొక్కడే సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమాను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను. ప్రభాస్ కోసం రెడీగా ఉన్న కథతో సినిమా చేయాల్సి ఉంది. అప్పుడే ఎన్టీఆర్ మేనేజర్ ఒకరు నన్ను తీసుకు వెళ్లారు. మూడు రోజుల పాటు నాతో ఉండి ‘అశోక్’ సినిమా కథను నా చేతిలో పెట్టాడు. నేను ఆలోచించుకోకుండానే అక్కడ చేద్దాం.. ఇక్కడ చేద్దాం.. ఇలా చేద్దాం అంటూ ఆయనే ప్లానింగ్ చేశాడు. ఎన్టీఆర్ ఒక పెద్ద హీరో కనుక కాదంటే ఏమవుతుందో అనే ఉద్దేశ్యంతో చేయాల్సి వచ్చింది.

అశోక్ కథ విషయంలో క్లారిటీ లేకుండానే మేనేజర్ ఒత్తిడి మేరకు చేయాల్సి వచ్చిందని సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చాడు. అశోక్ సినిమా ఎలాంటి ఫలితాన్ని చవి చూసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అశోక్ మళ్లీ అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అశోక్ సినిమా తీయకుండా ప్రభాస్ తో సినిమా చేయాల్సిన సురేందర్ రెడ్డి అప్పటి నుండి కూడా ప్రభాస్ తో సినిమా చేయలేదు. సురేందర్ రెడ్డి వ్యాఖ్యలతో తీవ్రంగా హర్ట్ అయిన నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో సూరిపై రెచ్చి పోయి మరీ కామెంట్స్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి.